వారంలోనే కరోనాని జయించిన స్టార్ హీరోయిన్ !

కరోనా మహమ్మారి ఇప్పట్లో మానవ జాతిని వదిలేలా లేదు. అయితే కరోనాని తొందరగా జయించి బయటపడుతున్న వారు కూడా రోజురోజుకూ పెరుగుతున్నారు. తాజాగా రకుల్ బేబీ కూడా ఈ లిస్ట్ లో చేరింది. తాజాగా జరిపిన కరోనా టెస్ట్‌ లో తనకు నెగెటీవ్‌ వచ్చిందని రకుల్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రకుల్ మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ”మీ ప్రేమాభిమానాల వల్లే కరోనా మహమ్మారి నుండి నేను ఇంత త్వరగా కోలుకోగలిగాను. నా పట్ల మీరందరి ప్రేమకు […]

Written By: admin, Updated On : December 29, 2020 7:18 pm
Follow us on


కరోనా మహమ్మారి ఇప్పట్లో మానవ జాతిని వదిలేలా లేదు. అయితే కరోనాని తొందరగా జయించి బయటపడుతున్న వారు కూడా రోజురోజుకూ పెరుగుతున్నారు. తాజాగా రకుల్ బేబీ కూడా ఈ లిస్ట్ లో చేరింది. తాజాగా జరిపిన కరోనా టెస్ట్‌ లో తనకు నెగెటీవ్‌ వచ్చిందని రకుల్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రకుల్ మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ”మీ ప్రేమాభిమానాల వల్లే కరోనా మహమ్మారి నుండి నేను ఇంత త్వరగా కోలుకోగలిగాను. నా పట్ల మీరందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రానున్న 2021 సంవత్సరాన్ని మంచి ఆరోగ్యంతో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాను” అంటూ రకుల్ పాప కాస్త ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.

Also Read: వాడుకోవట్లేదని ఫీల్ అవుతోన్న శ్రీముఖి !

పైగా పోస్ట్ తో పాటు కొన్ని సలహాలు సూచనలు కూడా చేస్తూ.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తప్పకుండా మాస్క్‌లను విధిగా ధరించాలని, కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించండని రకుల్ తన ఫ్యాన్స్‌ ను కోరింది. ఇక ఈ నెల 22వ తేదీన రకుల్ కి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అప్పటినుండి రకుల్ క్వారంటైన్‌లో చికిత్స పొందుతూ కేవలం వారం రోజుల్లోనే కరోనాను జయించగలిగింది. మొత్తానికి ఆరోగ్యం పరంగా తీసుకునే చర్యల కారణంగానే ఇంత త్వరగా కోలుకోగలిగింది.

Also Read: మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం !

కాగా కోవిడ్-19 విజృంభణతో జన జీవనం ఇప్పటికే అతలాకుతలం అయింది. నెలలు దాటినా దేశంలో మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉండటం నిజంగా ఆశ్చర్యకరమే. ఇప్పుడు మరో రకం కొత్త కరోనా వైరస్ ఉనికి బయటపడిందని ఇప్పటికే బ్రిటన్ లో చాలా మందికి సోకిందని , మన దేశం కూడా వచ్చేసిందని కేంద్ర ప్రభుత్వాలే స్వయంగా ప్రకించిన నేపద్యంలో ప్రజలు మరింతగా భయపడుతున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలలో సింగర్ బాలు,రాజమౌళి, రాజశేఖర్, జీవిత, తమన్నా ఇంకా మరి కొందరు సినీ ప్రముఖులు బారిన పడ్డారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్