కరోనా రోగులకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్య ఉంటే ప్రాణాలకే ముప్పు..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు దేశంలో కొత్తరకం కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు ఏడు కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడు కేసులలో రెండు కేసులు తెలంగాణలో నమోదు కాగా ఒక కేసు మాత్రం ఏపీలో నమోదు కావడం గమనార్హం. […]

Written By: Navya, Updated On : December 29, 2020 7:20 pm
Follow us on


దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా మళ్లీ వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు దేశంలో కొత్తరకం కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు ఏడు కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి.

ఈ ఏడు కేసులలో రెండు కేసులు తెలంగాణలో నమోదు కాగా ఒక కేసు మాత్రం ఏపీలో నమోదు కావడం గమనార్హం. అయితే కరోనా బారిన పడిన వారికి బ్లడ్‌ పాయిజనింగ్ సమస్య ఉంటే ప్రాణాలకే ముప్పు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికాలోని రట్గర్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. బ్లడ్‌ పాయిజనింగ్‌ సమస్యతో బాధ పడేవారికి శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

బ్లడ్‌ పాయిజనింగ్‌ తో బాధ పడేవారికి కరోనా సోకితే నీరసంతో బాధ పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా చికిత్స పొందే వారితో పోలిస్తే వీరు ఎక్కువ సమయం చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని.. వీరిలో మానసిక సమస్యలు కూడా కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 375 మంది కరోనా రోగులపై అధ్యయనం చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నారు.

కరోనాకు బ్లడ్ పాయిజనింగ్ సమస్య తోడైతే ఆక్సిజన్‌ శాతం తగ్గే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా ఉధృతి తగ్గినా ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను వినియోగించడం చేయాలని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.