https://oktelugu.com/

Rakul Preet Singh: బాలకృష్ణ కి పెద్ద నమస్కారం..ఆయనతో సినిమా చేయడం నావల్ల కాదు – రకుల్ ప్రీత్

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రం ద్వారా ఇండస్ట్రీ లో మొట్టమొదటి హిట్ ని అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అతి తక్కువ సమయంలోనే దక్కించుకుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 8, 2024 / 06:05 AM IST

    Rakul Preet Singh

    Follow us on

    Rakul Preet Singh: అందంతో పాటుగా చక్కటి అభినయం కలిగిన హీరోయిన్స్ మన ఇండస్ట్రీ లో దొరకడం చాలా కష్టం. అలా అందం, అభినయం రెండు ఉన్న హీరోయిన్స్ కి హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా క్రేజ్ ఉంటుంది, ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో కొనసాగుతారు అని విశ్లేషకులు మొదటి నుండి చెప్పే మాట. కానీ రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో అది జరగలేదు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ లో మొట్టమొదటి హిట్ ని అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అతి తక్కువ సమయంలోనే దక్కించుకుంది. కానీ ఆ హోదా ని ఆమె ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం, అదే సమయంలో పూజా హెగ్డే, రష్మిక ఇండస్ట్రీ లోకి సుడిగాలి లాగా దూసుకొని రావడం వల్ల రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు భారీ గా తగ్గిపోయాయి. అయితే శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2 చిత్రంలో ఈమె సిద్దార్థ్ కి జోడిగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే మళ్ళీ ఫామ్ లోకి వచ్చి కుమ్మేయొచ్చు అని అనుకుంది.

    కానీ ఆ చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. దీనితో అమ్మడి ఆశలు మొత్తం అడియాసలు అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఈమెకు బాలయ్య సినిమాలో బంగారం లాంటి అవకాశం వస్తే రిజెక్ట్ చేసిందట. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం ‘అఖండ’ కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ నే అనుకున్నారట. కానీ బాలయ్య తో నేను చెయ్యలేను, నాకు భయం అని చెప్పి ఆ సినిమా నుండి తప్పుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. ఆమె అలా అనడానికి కారణం కూడా ఉంది.

    ఎందుకంటే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ మహానటి శ్రీదేవి పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య బాబు గారు శ్రీదేవి తో కలిసి సినిమా చేయలేదని కానీ, శ్రీదేవి పాత్ర వేసుకున్న నాతో సినిమా చేసాడు అంటూ చెప్పుకొచ్చింది. ఈ మాటలకు బాలయ్య బాబు సీరియస్ గా ఒక్క లుక్ ఇస్తాడు, ఆయనకీ బాగా కోపం వచ్చింది అనే విషయం రకుల్ ప్రీత్ కి అర్థం అయ్యింది. మళ్ళీ బాలయ్య తో సినిమా చేస్తే అలాంటి సందర్భం రావొచ్చు, ఆ సమయంలో ఆయన నన్ను కొట్టినా కొట్టొచ్చు అనే భయంతోనే ఈ సినిమాని ఆమె రిజెక్ట్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక పుకారు తెగ షికారు చేస్తుంది.