https://oktelugu.com/

స్టార్ హీరోలను పట్టడంలో ఆమె మహా దిట్ట !

హీరోయిన్ ‘రకుల్ ప్రీత్ సింగ్’ హీరోలను పట్టుకోవడంలో మాస్టర్ డిగ్రీ చేసిందని అంటున్నారు బాలీవుడ్ జనం. పెద్దగా అందం అభినయం లేకపోయినా.. ఆమె ఉన్నట్టుండి బాలీవుడ్ లో ఎలా బిజీ అవ్వగలుగుతుంది ? ఒక స్టార్ హీరో ఆమెకు ఎందుకు వరుసగా ఆఫర్లు ఇస్తున్నారు ? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ రకుల్ కి వచ్చిన ఆ ఆఫర్ల గోల ఏమిటంటే.. అజయ్ దేవగన్, సిద్దార్థ్ మల్హోత్రా హీరోలుగా ఇంద్ర కుమార్ డైరెక్షన్లో రూపొందే “థాంక్ […]

Written By:
  • admin
  • , Updated On : January 8, 2021 / 09:59 AM IST
    Follow us on


    హీరోయిన్ ‘రకుల్ ప్రీత్ సింగ్’ హీరోలను పట్టుకోవడంలో మాస్టర్ డిగ్రీ చేసిందని అంటున్నారు బాలీవుడ్ జనం. పెద్దగా అందం అభినయం లేకపోయినా.. ఆమె ఉన్నట్టుండి బాలీవుడ్ లో ఎలా బిజీ అవ్వగలుగుతుంది ? ఒక స్టార్ హీరో ఆమెకు ఎందుకు వరుసగా ఆఫర్లు ఇస్తున్నారు ? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ రకుల్ కి వచ్చిన ఆ ఆఫర్ల గోల ఏమిటంటే.. అజయ్ దేవగన్, సిద్దార్థ్ మల్హోత్రా హీరోలుగా ఇంద్ర కుమార్ డైరెక్షన్లో రూపొందే “థాంక్ గాడ్” అనే సినిమాని రీసెంట్ గా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

    Also Read: టీజర్ టాక్: ‘కేజీఎఫ్2’ అంచనాలకు మించి..

    అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ నటించనుంది. ఇప్పటికే అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “మే డే” అనే సినిమాలో కూడా హీరోయిన్ గా రకుల్ నే నటిస్తోంది. అంటే, అజయ్ దేవగన్ తో ఆమెకిది వరుసగా రెండో సినిమా అన్నమాట. పైగా ఎనిమిది నెలల గ్యాప్ లో. అలాగే లాస్ట్ ఇయర్ కూడా అజయ్ దేవగన్ హీరోగా విడుదలైన “దే దే ప్యార్ దే” సినిమాలో కూడా రకుల్ హీరోయిన్ గా చేసింది. అంటే రెండేళ్లలో ఓ బాలీవుడ్ అగ్ర హీరో సరసన ఇలా మూడు సినిమాలు చేయడం అంటే.. మహామహా హీరోయిన్లకే సాధ్యం కాలేదు.. మరి రకుల్ కి ఎలా సాధ్యం అయింది అనేది బాలీవుడ్ జనం అనుమానాలు.

    Also Read: ‘క్రాక్’ కిరాక్ బిజినెస్.. అన్ని కోట్లా?

    నిజానికి రకుల్ హీరోలను మెప్పించడంలో మొదటినుండి ముందంజలోనే ఉంది. విషయం ఉన్న స్టార్ హీరోయిన్స్ కూడా ఆఫర్స్ అందుకోలేకపోతున్న రోజుల్లో కూడా.. ఒక్క ‘ర‌కుల్‌ ప్రీత్ సింగ్’ మాత్రమే జస్ట్ నాలుగేళ్లల్లోనే ఎన్టీఆర్, మహేష్, బన్నీ, చరణ్ లాంటి అందరీ స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా చేసింది. పైగా గత ఏడాది వరకూ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో రకుల్ పేరు ప్రముఖంగా వినిపించేది. దీనిబట్టి, స్టార్ హీరోలను పట్టడంలో రకుల్ మహా దిట్ట అన్నమాట. ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్.. కొన్నిరోజుల క్రితం నేషనల్ వైడ్‌ గా హాట్ టాపిక్ అవుతూ డ్రగ్ కేసులో చిక్కుకుందనే ఆరోపణలు చాల బలంగా వినిపించాయి. చివరకు ఎలాగోలా ఆ డ్రగ్స్ వివాదం నుండి బయట పడింది అనుకోండి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్