https://oktelugu.com/

Adipurush Collections: 3 రోజుల్లో 300 కోట్లు రాబట్టిన ‘ఆదిపురుష్’..ఇందులో ఫేక్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

అయితే నిర్మాతలు మాత్రం వచ్చిన వసూళ్ల కంటే ఎక్కువ చెప్తున్నారు అంటూ ట్రేడ్ పండితులు ఆరోపిస్తున్నారు. నిజానికి రెండవ రోజు ఈ చిత్రానికి 67 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి, కానీ నిర్మాతలు వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చినట్టు చూపించారు.

Written By:
  • Vicky
  • , Updated On : June 19, 2023 / 09:04 AM IST

    Adipurush Collections

    Follow us on

    Adipurush Collections: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం రీసెంట్ గానే అన్నీ ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదలై నెగటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రామాయణం లోని ముఖ్యమైన ఘట్టాలను అపహాస్యం చేసారని, ఇది శ్రీ రాముడి చరిత్ర ని నేటి తరం ప్రేక్షకులకు చూపించినట్టుగా లేదు, వాళ్లకి రామాయణం అంటే ఇంత చెత్తగా ఉంటుందా అనే విధంగా అర్థం అయ్యేట్టు డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని, మన ఇతిహాసం ని ఇంత చెత్తగా ఇప్పటి వరకు ఎవరూ చూపించలేదని సోషల్ మీడియా లో భయంకరమైన నెగటివ్ టాక్ వ్యాప్తి చెందింది. అయితే ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ చిత్రానికి మొదటి వీకెండ్ అద్భుతమైన వసూళ్లు వచ్చాయి, ఇక హిందీ లో శ్రీ రాముడి సెంటిమెంట్ కారణంగా అక్కడ కూడా మొదటి మూడు రోజులు వసూళ్లు దంచికొట్టింది.

    అయితే నిర్మాతలు మాత్రం వచ్చిన వసూళ్ల కంటే ఎక్కువ చెప్తున్నారు అంటూ ట్రేడ్ పండితులు ఆరోపిస్తున్నారు. నిజానికి రెండవ రోజు ఈ చిత్రానికి 67 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి, కానీ నిర్మాతలు వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చినట్టు చూపించారు.

    ఇక మూడవ రోజు కూడా ఇదే పరిస్థితి, వంద కోట్ల రూపాయలకు పైగా మూడవ రోజు కూడా వసూళ్లు వచ్చాయని, మొత్తం మీద మూడు రోజులకు కలిపి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చిందని అంటున్నారు. ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం మూడవ రోజు ఈ చిత్రానికి కేవలం 65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి,అలా మూడు రోజులకు 249 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, కానీ నిర్మాతలు 50 కోట్ల రూపాయలకు పైగా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు అంటూ ట్రేడ్ పండితులు చెప్తున్నారు.