Homeఎంటర్టైన్మెంట్Rakasa Movie OTT: ఓటీటీ లోకి 'రాకాస ' చిత్రం గ్రాండ్ ఎంట్రీ.. ఎందులో చూడొచ్చంటే..

Rakasa Movie OTT: ఓటీటీ లోకి ‘రాకాస ‘ చిత్రం గ్రాండ్ ఎంట్రీ.. ఎందులో చూడొచ్చంటే..

Rakasa Movie OTT: ‘మ్యాడ్’ సిరీస్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న సంగీత్ శోభన్(Sangeeth Sobhan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాకాస'(Rakasa Movie) బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. 13 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ చిత్రం, క్లోజింగ్ లో దాదాపుగా 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. […]

Rakasa Movie OTT: ‘మ్యాడ్’ సిరీస్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న సంగీత్ శోభన్(Sangeeth Sobhan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాకాస'(Rakasa Movie) బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. 13 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ చిత్రం, క్లోజింగ్ లో దాదాపుగా 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. కేవలం కోటి రూపాయిల లాభాలు మాత్రమే వచ్చినప్పటికీ, సంక్రాంతి సీజన్ సినిమాల తర్వాత క్లీన్ హిట్ గా నిల్చిన ఏకైక చిత్రం ఇదేనని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ‘కమిటీ కుర్రాళ్ళు’ వంటి భారీ హిట్ తర్వాత , నిహారిక కొణిదెల ఈ చిత్రం ద్వారా మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది.

నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. ఆ సంస్థ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని ఈ నెల 30 న కానీ , లేదంటే మే 1 న కానీ విడుదల చెయ్యాలి. నెట్ ఫ్లిక్స్ సంస్థ కూడా ఈ వారం లోనే ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనుంది. మూవీ లవర్స్ ఎలాగో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసారు కానీ , ఓటీటీ ఆడియన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుందా అని ఆతృతగా ఎదురు చూశారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నారు మేకర్స్. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , ఓటీటీ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper