Homeవింతలు-విశేషాలుTrevi Fountain Incident: చిల్లర లేదని చిరాకు పడింది.. చివరికి నీటిలో ఆ పని చేసింది

Trevi Fountain Incident: చిల్లర లేదని చిరాకు పడింది.. చివరికి నీటిలో ఆ పని చేసింది

Trevi Fountain Incident: ఏ మనిషికైనా సరే కోపమనేది హద్దులో ఉండాలి. అదేదో సినిమాలో హీరో చెప్పినట్టు కోపాన్ని.. ఆయుధాన్ని ఎక్కడ వాడలో తెలుసుకోవాలి. సామాన్యుల విషయాన్ని పక్కన పెడితే సెలబ్రిటీలకు కోపం అనేది వెంటనే వచ్చేస్తూ ఉంటుంది.. బహుశా ఉప్పు కారం ఎక్కువ తింటారేమో. జనాల వల్ల.. సమాజం వల్ల తాము ఈ స్థాయికి ఎదిగామని వారు మర్చిపోతారు. జనాన్ని చూడగానే రెచ్చిపోతారు. చివరికి అదే స్థాయిలో కోపాన్ని తెచ్చుకొని ఊగిపోతారు. కేవలం మనదేశంలోనే కాదు.. […]

Trevi Fountain Incident: ఏ మనిషికైనా సరే కోపమనేది హద్దులో ఉండాలి. అదేదో సినిమాలో హీరో చెప్పినట్టు కోపాన్ని.. ఆయుధాన్ని ఎక్కడ వాడలో తెలుసుకోవాలి. సామాన్యుల విషయాన్ని పక్కన పెడితే సెలబ్రిటీలకు కోపం అనేది వెంటనే వచ్చేస్తూ ఉంటుంది.. బహుశా ఉప్పు కారం ఎక్కువ తింటారేమో. జనాల వల్ల.. సమాజం వల్ల తాము ఈ స్థాయికి ఎదిగామని వారు మర్చిపోతారు. జనాన్ని చూడగానే రెచ్చిపోతారు. చివరికి అదే స్థాయిలో కోపాన్ని తెచ్చుకొని ఊగిపోతారు. కేవలం మనదేశంలోనే కాదు.. బయట దేశాల్లో కూడా సెలబ్రిటీలు ఇదేవిధంగా వ్యవహరిస్తూ ఉంటారు.

యూరప్ ప్రాంతంలో రోమ్ నగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ట్రేవి ఫౌంటెన్ ఎంతో ప్రఖ్యాతి చెందినది. ఇందులో పాప్ స్టార్ కేటి ఫెర్రీ పిచ్చి పని చేసింది. ఆమె చేసిన పని చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఫౌంటెన్ లో చాలామంది కాయిన్స్ విసురుతారు. అదృష్టం తమను వరించాలని కోరుతారు. తాము చేపట్టే పని విజయవంతం కావాలని.. డబ్బులు సంపాదించాలని.. గొప్ప పేరు తెచ్చుకోవాలని.. సమాజంలో ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు.

కాయిన్స్ విసరిస్తే అంతా మంచి జరుగుతుందని ఇక్కడికి వచ్చిన జనం భావిస్తుంటారు. దానికంటే ముందు ప్రార్థనలు చేస్తారు. రోమ్ ప్రాంతంలో క్రైస్తవ మతం అధికంగా ఉంటుంది. ఇక్కడ యేసు క్రీస్తు పుట్టిన రోజు నాడు వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. అయితే చాలామంది ఏసుక్రీస్తు మనసులో తలుచుకొని కాయిన్స్ అందులో విసిరేస్తుంటారు. పాప్ స్టార్ ఫెర్రీ మాత్రం కాయిన్స్ కాకుండా, తన క్రెడిట్ కార్డును నీటిలో జారవిడిచారు. తాను కోరుకున్న కోరిక నెరవేరాలని ఆమె భావించారు. ఇందులో భాగంగానే ఆమె ఆ కార్డును నీటిలో జార విడిచారు. చిల్లర లేకపోవడంతో ఆమె ఈ పని చేసినట్టు తెలుస్తోంది.

తన క్రెడిట్ కార్డును అలా జారవిడచడం ద్వారా ఫెర్రీ కొత్త పనికి శ్రీకారం చుట్టారని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ట్రెండ్ చాలామంది ఫాలో అవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఈ పనితో ఆమె స్వర్గానికి వెళ్తుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.. “ఏ పని చేసినా సరే జనం మెచ్చుకునే విధంగా ఉండాలి. నొచ్చుకునే విధంగా ఉండకూడదు. కానీ ఈమె అలాంటి పని చేసింది. ఏకంగా క్రెడిట్ కార్డును అందులో విసిరేసింది. దీనిని పిచ్చి అనుకోవాలా.. వెర్రి అనుకోవాలా.. తెలియడం లేదు. కాయిన్స్ లేకపోతే తెచ్చుకోవాలి. ఎవరినైనా అడిగితే కూడా ఇస్తారు. అలా కాకుండా క్రెడిట్ కార్డును నీటిలో వేయడమేంటని” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper