Homeఎంటర్టైన్మెంట్Rakasa Biker OTT release: ఒకే రోజు ఓటీటీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న 'రాకాస',...

Rakasa Biker OTT release: ఒకే రోజు ఓటీటీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘రాకాస’, ‘బైకర్’.. ఎందులో చూడాలంటే..

Rakasa Biker OTT release: సంక్రాంతి సీజన్ తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ ని అందుకుంటున్న టాలీవుడ్ కి , ఏప్రిల్ 2 న విడుదలైన ‘బైకర్’, ‘రాకాస’ చిత్రాలు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ‘రాకాస ‘ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకోగా, భారీ బిజినెస్ ని జరుపుకున్న ‘బైకర్’ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేక డిజాస్టర్ గా […]

Rakasa Biker OTT release: సంక్రాంతి సీజన్ తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ ని అందుకుంటున్న టాలీవుడ్ కి , ఏప్రిల్ 2 న విడుదలైన ‘బైకర్’, ‘రాకాస’ చిత్రాలు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. అయితే తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ‘రాకాస ‘ చిత్రం కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకోగా, భారీ బిజినెస్ ని జరుపుకున్న ‘బైకర్’ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేక డిజాస్టర్ గా నిల్చింది. ఈ రెండు సినిమాల్లో ‘రాకాస’ కే అధిక వసూళ్లు కూడా వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే, ఇప్పుడు ఈ రెండు చిత్రాలు ఒకే రోజున ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ రెండు చిత్రాలను మంచి ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. విడుదల తర్వాత నాలుగు వారాలకు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసుకునేలా మేకర్స్ తో ఒప్పందం చేసుకున్నారు.

ఈ రెండు చిత్రాలకు సంబంధించిన థియేట్రికల్ రన్ పూర్తి అయ్యి , 10 రోజులు కావొస్తుంది. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని ఒకే రోజున నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయబోతున్నారు. థియేటర్స్ లో రెండిటికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, ‘రాకాస ‘ కి ఎక్కువ వసూళ్లు ఎలా అయితే వచ్చాయో, ఓటీటీ లో మాత్రం ‘బైకర్’ చిత్రానికి ‘రాకాస’ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇలాంటి సినిమాలను వరల్డ్ వైడ్ గా బాగా ఇష్టపడే ఆడియన్స్ సంఖ్య ఎక్కువ. అందుకే ‘బైకర్’ జానర్ సినిమాలకు ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. మే 1 న ఈ రెండు చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. తెలుగు తో పాటు , ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ఇక ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ వసూళ్ల విషయానికి వస్తే, బైకర్ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 21 కోట్ల రూపాయలకు జరగ్గా, బాక్స్ ఆఫీస్ నుండి 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. అంటే దాదాపుగా 9 కోట్ల రూపాయిల నష్టం అన్నమాట. ఇక ‘రాకాస ‘ విషయానికి వస్తే ఈ చిత్రానికి విడుదలకు ముందు 13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, బాక్స్ ఆఫీస్ నుండి 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే కోటి రూపాయిలు లాభం అన్నమాట. మరి ఓటీటీ లో ఏ చిత్రానికి ఎక్కువ రెస్పాన్స్ రాబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper