Dhanush Kara Movie: విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి అందించే హీరోల లిస్ట్ తీస్తే అందులో ముందు వరుసలో ఉండే హీరో ధనుష్. తన కెరీర్ మొత్తం చూసుకుంటే ప్రయోగాత్మక చిత్రాలే ఉంటాయి. నటన పరంగా కూడా తన ప్రతీ సినిమాతో ఆడియన్స్ ని థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తుంటాడు ధనుష్(Dhanush K Raja). గత ఏడాది ఆయన హీరో గా నటించిన ‘కుబేర’ చిత్రం మన టాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. అదే విధంగా హిందీ లో ఆయన హీరోగా నటించిన ‘తేరే ఇష్క్ మెయిన్’ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన హీరోగా నటించిన చిత్రం ‘కర'(Kara Movie). విగ్నేష్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30 న విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసి, థియేట్రికల్ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నా యుద్ధాల కారణంగా, ఇరాన్ దేశం తన చుట్టుపక్కన ఉన్నటువంటి దేశాలకు సంబంధించిన ఆయిల్ వనరులపై దాడులు చేయడం తో తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యం పై ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ విగ్నేష్ రాజా. ఆ దేశం లో పని చేసే హీరో ధనుష్ , యుద్ధం కారణంగా ఏర్పడిన సంక్షోభానికి గురై మన దేశానికి తిరిగి రావడం, ఇక్కడకి వచ్చిన తర్వాత ఏ పని చెయ్యాలో తెలియని ఆయన బ్యాంక్ లో దొంగతనాలకు పాల్పడడం వంటివి ఈ ట్రైలర్ లో చూపించారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో , ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.
ఇలా యదార్ధ సంఘటనల ఆధారంగా తీసుకొని తెరకెక్కించే సినిమాలకు ప్రస్తుతం మార్కెట్ లో మామూలు రేంజ్ డిమాండ్ లేదు. అందుకే ఈ చిత్రం కచ్చితంగా వర్కౌట్ అవుతుందని చాలా బలంగా నమ్ముతున్నాడు ధనుష్. ప్రొమోషన్స్ కూడా ఇంతకు ముందు ఏ సినిమాకు చేయనంతగా ఈ చిత్రానికి చేస్తున్నాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే ఈ నెల 30 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం లో హీరోయిన్ గా మమిత బైజు నటించింది . ఇన్ని రోజులు యూత్ ఫుల్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించిన మమిత, ఇప్పుడు సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన గృహిణి గా నటిస్తోంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ ట్రైలర్ ని మీరు కూడా చూసేయండి.
