Raju Weds Rambai Trailer Talk: సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా లవ్ స్టోరీస్ కి ఉంటే క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ప్రేమ కథ చిత్రాలను తీయడం లో కొంతమంది దర్శకులకు మంచి గ్రిప్ ఉంటుంది. ఇక జనాల్లో కూడా ప్రేమ కథ చిత్రాలకు ఉండే ఆదరణ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాలు కూడా అవే కావడం విశేషం…ఇక విలేజ్ లవ్ స్టోరీస్ కి ఈ మధ్యకాలంలో మంచి ఆదరణ దక్కుతోంది… ఇక ప్యూర్ లవ్ స్టోరీ సినిమాలను చూసి చాలా రోజులు అవుతోంది.ఫిదా, అర్జున్ రెడ్డి తర్వాత అంత గొప్ప లవ్ స్టోరీ తో సినిమాలేవి రాలేదనే చెప్పాలి. ఇప్పుడు వేణు ఉడుగుల నిర్మాతగా మారి చేస్తున్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా కూడా ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతోంది… ఈ మూవీ ఈనెల 21వ తేదీన సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో గత కొద్దిసేపటి క్రితమే ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రాంబాయి తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకో లేక ఇటు ఇంట్లో వాళ్లతో కలిసి ఉండలేక నరకాన్ని చూస్తోంది. ఇలాంటి అమాయకపు రాంబాయిని రాజు ఎలా గెలుచుకున్నాడు.
అనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఇక ‘ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు’ అంటూ ట్రైలర్ మొదట్లోనే ఇచ్చిన ఒక లైన్ మీదనే ఈ సినిమా నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎవ్వరు ఊహించని ఒక క్లైమాక్స్ ను ఈ సినిమాలో చూడబోతున్నాం అనే విషయాన్ని దర్శకుడు మొదట్లోనే చెప్పేసినట్టుగా తెలుస్తోంది. రాజు వెడ్స్ రాంబాయి పరిపూర్ణమైన ప్రేమ కథ గా మిగులుతోందా?
లేదంటే ప్రేమ చేసిన చేదుగాయానికి బలైపోయిన అమర ప్రేమికులను మనం చూడబోతున్నామా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ముఖ్యంగా రాజు ప్రేమలో తెగింపు, రాంబాయి ప్రేమలోని నిజాయితీ ఉంది.
కాబట్టి వాళ్ల ప్రేమని ప్రేమే కలుపుతోందని చెప్పబోతున్నారా? లేదా సాడ్ ఎండింగ్ ని ఇచ్చి ప్రేమ ఎప్పుడూ నరకాన్ని మిగులుస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది..విజువల కూడా బాగున్నాయి… హీరో ఒకే, హీరోయిన్ మాట్లాడిన తెలంగాణ యాస్ అంత బాగా సెట్ అయినట్టుగా అనిపించలేదు… అదొక్కటి చూసుకుంటే బాగుండేది…
Their hearts beat as one, their love faces every storm ❤️
Experience the Emotionally Stirring & heart-touching trailer of the Greatest love saga #RajuWedsRambai ❤️❤️
▶️ https://t.co/djvfzDbskx#RajuWedsRambaiOnNov21st pic.twitter.com/wHwhENYIm7
— Matters Of Movies (@MattersOfMovies) November 13, 2025