Ram Gopal Varma: ‘శివ’ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ ఒక్క సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తనను పరిచయం చేసింది. ఒక నాలుగు సంవత్సరాల పాటు ఎక్కడ చూసిన శివ సినిమా గురించి, రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుకునేవారు. అప్పుడు అలాంటి మేనియా ను మెయింటైన్ చేశాడు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో అతనితో సినిమా చేయడానికి ఆసక్తి ఎదురు చూసేవారు. తన డైరెక్షన్ లో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్న హీరోలు సైతం చాలామంది ఉన్నారు. ఇక బాలీవుడ్లో సైతం ఆయన చాలామంది హీరోలతో సినిమాలను చేశాడు. అమీర్ ఖాన్, అమితాబచ్చన్ లాంటి హీరోలతో గొప్ప సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక ఇదే క్రమంలో రామ్ గోపాల్ వర్మతో సినిమా అనగానే షారుక్ ఖాన్ మాత్రం మొదట అతనితో సినిమా చేయనని చెప్పారట. అయినప్పటికీ అమీర్ ఖాన్ తో చేసిన రంగీలా సినిమా సూపర్ సక్సెస్ ను సాధించడం తో ఆ తర్వాత షారుక్ ఖాన్ వర్మతో సినిమా చేయాలని అనుకున్నాడు.
కానీ వర్మ మాత్రం షారుక్ ఖాన్ తో సినిమా చేయడానికి ఒప్పుకోలేదట. మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుండేదని అప్పట్లో ప్రతి ఒక్క ప్రేక్షకుడు కోరుకున్నాడు. కానీ వర్మ మాత్రం అతనితో సినిమా చేయలేదు. ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ కి మంచి గుర్తింపు వచ్చినప్పటికి వీళ్ళ కాంబినేషన్లో సినిమా అయితే రాలేదు.
వర్మ అమితాబ్ తో సర్కార్, కంపెనీ లాంటి సినిమాలను చేసి సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాడు. ఆయన సినిమాలకు ఒక సపరేట్ ఐడెంటిటి ఉంటుంది. ప్రతి ఒక్కరూ అతని సినిమాలను చూసి ఇన్స్పైర్ అయి ఇండస్ట్రీకి వస్తూ ఉంటారు. ఇక ఇండస్ట్రీలో సైతం అతనికి గొప్ప గుర్తింపైతే ఉంది.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మకి ముందు రామ్ గోపాల్ వర్మ తర్వాత అనేంతలా ఒక గొప్ప చరిత్ర ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం శివ సినిమాలో రీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రీ రిలీజ్ లో సైతం ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచుతూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…