https://oktelugu.com/

NTR-Rajiv Kanakala : ఎన్టీఆర్ తో గొడవ మీద క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల కొడుకు…

ఇప్పటికైనా సోషల్ మీడియాలో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ గొడవ మీద వచ్చే రూమర్లను తగ్గిస్తే బాగుంటుంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు..

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2023 2:22 pm
    Follow us on

    NTR-Rajiv Kanakala : నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడోతరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక మొదటి సినిమా నుంచి మొన్న వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా వరకు తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వచ్చాడు.

    ఇక ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో తో రాజీవ్ కనకాల మొదటి నుంచి ఇప్పటివరకు మంచి ఫ్రెండ్ గా కొనసాగుతు వస్తున్నాడు.ఇక ఈ మధ్య వీళ్ళిద్దరికీ ఒక గొడవ జరిగిందని దాని వల్లనే ఎన్టీయార్ కి రాజీవ్ కనకాల కి మాటలు లేవు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం అయితే జరుగుతుంది.ఇక ఈ విషయం మీద రాజీవ్ కనకాల కొడుకు అయిన రోషన్ కనకాల కూడా క్లారిటీ ఇచ్చాడు…ఇక ఈ మధ్య బబుల్ గేమ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నా ఆయన ఈ విషయం మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అవుతున్న క్రమంలో ఆయన సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.ఇక క్రమంలోని రోషన్ కనకాలని రాజీవ్ కనకాల ఎన్టీఆర్ గొడవ గురించి అడగగా ఆయన దాన్ని ఖండిస్తూ వాళ్ళిద్దరికీ ఎప్పుడు గొడవలు జరగలేదు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ ఈ విషయం మీద మా నాన్న ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు.

    అయినప్పటికీ ఈ విషయాన్ని ఇంకా కూడా లాగుతూ ఇప్పటివరకు వస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు అంటూ చాలా ఘటు గా రియాక్ట్ అయ్యాడు. ఎన్టీఆర్ తో మా నాన్న రోజు ఫోన్ లో మాట్లాడుతాడు. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ తరచుగా కలుసుకుంటూ ఉంటారు. నన్ను ఎన్టీఆర్ ను చూసే డాన్స్ నేర్చుకోవాలని నటన నేర్చుకోవాలని తరుచుగా చెప్తూ ఉంటాడు.నాక్కూడా ఒక మంచి నటుడు అవ్వాలనే కోరిక ఉంది అంటూ తను మాట్లాడాడు…

    ఈ విషయం మీద రాజీవ్ కనకాల ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ విషయం తరుచుగా వినిపిస్తూ ఉండడంతో వాళ్లిద్దరి మధ్య మళ్ళీ గొడవ జరిగిందా అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిలో వాస్తవం లేదు అని మరొకసారి రోషన్ కనకాల తన మాటలతో సమాధానం చెప్పాడు…ఇక ఇప్పటికైనా సోషల్ మీడియాలో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ గొడవ మీద వచ్చే రూమర్లను తగ్గిస్తే బాగుంటుంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…