https://oktelugu.com/

Vijay : పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో సక్సెస్ అయినట్టుగా విజయ్ కూడా సక్సెస్ సాధిస్తాడా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఎంజీఆర్ లాంటి నటుడు కొన్ని దశాబ్దాల పాటు స్టార్ హీరోగా వెలుగొందటమే కాకుండా ఆ తర్వాత రాజకీయ పార్టీని స్థాపించి సీఎంగా కూడా మారాడు..ఇక ఇప్పుడు ఆయన బాటలోనే మరి కొంతమంది స్టార్ హీరోలు కూడా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 5, 2024 / 07:20 PM IST

    Tamil star hero vijay

    Follow us on

    Vijay :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇక్కడ స్టార్ డమ్ ని అందుకున్నాడు. ఇక పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని తద్వారా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ముందడుగు వేస్తున్నాడు. ఇక 2014వ సంవత్సరంలో జనసేన పార్టీని స్థాపించి ప్రత్యేక్ష రాజకీయాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ 2024 వ సంవత్సరంలో భారీ సీట్లను కైవసం చేసుకున్నాడు.ఇక ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారం లో కూర్చోబెట్టడమే కాకుండా తను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నాడు. అలాగే పలు శాఖలకు మంత్రిగా కూడా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆయన ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తున్నాడనే చెప్పాలి. ఇలాంటి కళ్యాణ్ తనదైన రీతిలో ప్రజలకు సేవ చేస్తూనే అవకాశం దొరికిన సమయంలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాటలోనే తమిళ్ స్టార్ హీరో అయిన విజయ్ కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన రీసెంట్ గా ‘తమిళ వెట్రి కజగం’ అనే రాజకీయ పార్టీ పెట్టి తన పూర్తి జీవితాన్ని రాజకీయానికే అంకితం చేయబోతున్నట్టుగా తెలియజేశాడు. ఇక ప్రస్తుతం ఆయన తన చివరి సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

    ఇక రీసెంట్ గా వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన ‘గోట్ ‘ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో తన చివరి సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ఉద్దేశ్యంతో ఒక మంచి కథని తీసుకునే ఆలోచనలో విజయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక విజయ్ కి తమిళనాడులో మంచి క్రేజ్ అయితే ఉంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. మరి ఆ ఫ్యాన్స్ అందరూ అతనికి రాజకీయంగా హెల్ప్ చేస్తారా? ఆయన అధికారంలోకి రావడానికి వాళ్ళందరూ కలిసికట్టుగా శ్రమిస్తారా? అనే విషయాల మీదనే ఇప్పుడు చాలా వరకు అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.

    ఇక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పార్టీ పెట్టిన పది సంవత్సరాలకి డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు. మరి విజయ్ లాంటి ఒక స్టార్ హీరో పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి వస్తాడా? లేదంటే అపోజిషన్ గా కూడా తన పార్టీని కొనసాగిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సక్సెస్ సాధించినట్టే ఈయన కూడా సక్సెస్ అయితే మాత్రం రాజకీయాల్లోకి రావాలనుకునే మరికొంత మంది హీరోలకు వీళ్ళు ఆదర్శంగా నిలుస్తారు…