Kannappa trailer : ఈ మధ్య కాలం లో అంచనాలే లేని సినిమాలు సైలెంట్ గా థియేటర్స్ లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి. మంచు ఫ్యామిలీ హీరోల సినిమాలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో ట్రోల్ అవుతాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బయట ఏదైనా ఫంక్షన్ లో స్పీచ్ ఇచ్చినా ట్రోల్ మెటీరియల్ గా మారిపోతూ ఉంటాయి. అలాంటి మంచు హీరో సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయితే సోషల్ మీడియా మొత్తం పాజిటివ్ రెస్పాన్స్ తో ఊగిపోతుందని ఎప్పుడైనా ఊహించామా?, కానీ నేడు విడుదలైన ‘కన్నప్ప'(Kannappa Movie) ట్రైలర్ కి అలాంటి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ మొత్తం సర్ప్రైజ్ కి గురయ్యారు. అసలే బాక్స్ ఆఫీస్ వద్ద కరువు కాలం కనిపిస్తుంది. ఆ కరువు నుండి టాలీవుడ్ ని బయటకు తీసుకొని రావడానికి ఈ మాత్రం చాలు అని అంటున్నారు విశ్లేషకులు.
అయితే ఈ ట్రైలర్ సినిమాకు ఓపెనింగ్స్ రప్పిస్తాయా..?, అంచనాలను ఈ ట్రైలర్ బాగా పెంచిందా లేదా అనేది ఇప్పుడు విశ్లేషిద్దాం. ట్రైలర్ ని చూస్తుంటే ప్రభాస్(Rebel Star Prabhas) సన్నివేశాలు చాలా బాగా వచ్చినట్టు ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్న స్టార్స్ అందరికంటే ప్రభాస్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్, ఆయన అభిమానులను సంతృప్తి పరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి కచ్చితంగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అయితే అదిరిపోతాయి అనొచ్చు. మొదటి రోజు 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక లాంగ్ రన్ ఈ చిత్రానికి ఉంటుందా లేదా అనేది విడుదల రోజు టాక్ ని బట్టి తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు ప్రొమోషన్స్ లో మొదటి నుండి ఈ చిత్రానికి 200 కోట్లు ఖర్చు చేసాము అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ట్రైలర్ లో ఆ బడ్జెట్ కనిపించలేదు.
సినిమాలో ఏమైనా దాచిపెట్టారో ఏమో తెలియదు కానీ, ట్రైలర్ లో మాత్రం ఆయన చెప్పిన బడ్జెట్ కనిపించలేదు. ఇది సినిమాకు కాస్త నెగటివ్ అవ్వొచ్చు. కానీ నిన్న మొన్నటి వరకు ఈ సినిమాకు కనీస స్థాయి ఓపెనింగ్ అయినా ఉంటుందా అనే సందేహం ఉండేది. ట్రైలర్ ఆ సందేహాలకు చెక్ పెట్టింది. ట్రైలర్ తర్వాత అంచనాలు మారాయా అంటే కచ్చితంగా మారాయి అని చెప్పొచ్చు. సినిమాలో కంటెంట్ బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అక్షయ్ కుమార్ ఇందులో మహాశివుడి క్యారక్టర్ చేసాడు. కాబట్టి సినిమాలో దమ్ముంటే కచ్చితంగా ఈ చిత్రం బాలీవుడ్ లో కూడా హిట్ అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. మంచు విష్ణు కి కుంభస్థలం బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. మరి బద్దలు కొడతాడా లేదా అనేది తెలియాలంటే ఈ నెల 27 వరకు ఆగాల్సిందే.