Bigg Boss 8 : తెలుగు ‘బిగ్ బాస్’ హిస్టరీ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా ‘సీజన్ 7’ నిల్చింది. శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ ఇలా ఎంతో మంది టాప్ కంటెస్టెంట్స్ ఈ సీజన్ ని అద్భుతంగా రక్తి కట్టించి వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ నుండి, ఫినాలే ఎపిసోడ్ వరకు టీఆర్ఫీ రేటింగ్స్ సెన్సేషనల్ గా ఉండేవి. ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 టీఆర్ఫీ రేటింగ్స్ వీకెండ్స్ లో కూడా 4 రేటింగ్స్ ని దాటడం లేదు. కానీ సీజన్ 7 కి డైలీ ఎపిసోడ్స్ కి 8 కి పైగా రేటింగ్స్, వీకెండ్ ఎపిసోడ్స్ కి 16 కి పైగా రేటింగ్స్ వచ్చేవి. ముఖ్యంగా ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ జరిగే రోజు టాప్ 5 కంటెస్టెంట్స్ కి సంబంధించిన అభిమానులు వేలాదిగా అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద హాజరయ్యారు.
ఇన్నేళ్ల అన్నపూర్ణ స్టూడియోస్ హిస్టరీ లో ఎప్పుడూ కూడా ఇంత జనాలు చూడలేదని అక్కడ పని చేసే స్టాఫ్ చెప్పుకొచ్చింది. పోలీసులు సైతం జనాలను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ కి సంబంధించిన మనుషులు రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ కార్ పై దాడి చేయడం వంటి ఘటనలు అప్పట్లో సంచలనంగా మారింది. అంతే కాకుండా పల్లవి ప్రశాంత్ పోలీస్ ప్రోటోకాల్స్ ని లెక్క చేయకుండా వెనుక గేట్ నుండి కాకుండా మెయిన్ గేట్ నుండి వెళ్లడంతో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఆరోజు అక్కడికి వచ్చిన కంటెస్టెంట్స్ అందరి కార్లు ద్వంసం అయ్యాయి. అశాంతి వాతావరణం నెలకొంది. అప్పట్లో పోలీసులు బిగ్ బాస్ యాజమాన్యం పై ఫైర్ అయ్యారు. ఇది కచ్చితంగా బిగ్ బాస్ టీం నిర్లక్ష్యం కారణంగానే జరిగింది అంటూ నోటీసులు కూడా జారీ చేసారు. ఇప్పుడు మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే జరగనుంది.
ఈ ఫినాలే కి గత సీజన్ లో లాగ పొరపాట్లు జరగకుండా భారీ బందోబస్తు ని ఏర్పాటు చేస్తుంది బిగ్ బాస్ టీం. మరోసారి పోలీస్ ప్రోటో కాల్స్ ని పాటించకుండా, ఏ కంటెస్టెంట్ అయినా వ్యవహరిస్తే కచ్చితంగా బిగ్ బాస్ టీం దానికి బాద్యులు అవుతారని, శాశ్వతంగా ఈ షోని నిషేధిస్తామని పోలీస్ శాఖ బిగ్ బాస్ యాజమాన్యం కి చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పోలీసులు ఇచ్చిన ఈ వార్నింగ్ ని మనసులో పెట్టుకొని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట బిగ్ బాస్ టీం. మరి ఈసారైనా ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటారో లేదో చూడాలి. ఈ సీజన్ గత సీజన్ రేంజ్ లో హిట్ కాదు కాబట్టి, అంతగా కంట్రోల్ చెయ్యలేనంత జనాలు స్టూడియో కి వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు చెప్తున్నారు.