Shivaji: అది నిరూపిస్తే చచ్చిపోతా, నాకెంత ఆస్తి ఉందో తెలుసా?… బిగ్ బాస్ శివాజీ సంచలన కామెంట్స్

పల్లవి ప్రశాంత్ విజయానికి, యావర్ ఫినాలే వరకు రావడానికి శివాజీ వెనకుండి నడిపించడం వల్లే సాధ్యమైందని ప్రేక్షకులు భావించారు. అందుకే శివాజీకి ప్రశంసలు కూడా దక్కాయి. బిగ్ బాస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు శివాజీ.

Written By: S Reddy, Updated On : January 22, 2024 10:19 am

Bigg Boss Shivaji

Follow us on

Shivaji: నటుడు శివాజీ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. హౌస్ లో రెండు వారాల ఉంటే ఎక్కువ అనుకున్న శివాజీ ఫినాలేకు చేరుకున్నాడు.తన తెలివితేటలు, మాట తీరు, ప్రవర్తన తో అందరి దృష్టిని ఆకర్షించాడు. టైటిల్ రేసులో నిలిచి పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ లకు గట్టి పోటీ ఇచ్చాడు. ఫినాలే లో టాప్ 3 స్థానం దక్కించుకున్నాడు. కాగా శివాజీ మొదటి నుంచి ప్రశాంత్, యావర్ లకు అండగా నిలిచాడు. ఇది శివాజీ కి చాలా ప్లస్ అయింది.

పల్లవి ప్రశాంత్ విజయానికి, యావర్ ఫినాలే వరకు రావడానికి శివాజీ వెనకుండి నడిపించడం వల్లే సాధ్యమైందని ప్రేక్షకులు భావించారు. అందుకే శివాజీకి ప్రశంసలు కూడా దక్కాయి. బిగ్ బాస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు శివాజీ. బయటకు వచ్చాక ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు అంశాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన ఆస్తుల గురించి బయట పెట్టాడు శివాజీ.

ఆయనకు ఒకప్పుడు ప్రధాన నగరాల్లో ఎకరాల భూములు, వ్యాపారాలు ఉండేవట. అప్పట్లో నేను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కనుక ఉండి ఉంటే .. ఇండస్ట్రీలో నన్ను మించిన ధనవంతుడు ఉండేవాడు కాదన్న శివాజీ షాకింగ్ విషయాలు వెల్లడించారు. అయితే ఓ సినిమా కోసం అత్యంత విలువైన 14 ఎకరాల భూమిని అమ్మేశానని శివాజీ అన్నారు. సొంత ఊరిలో ఉన్న పొలం శాశ్వతంగా ఉంటే చాలు అనుకున్నాను, అందుకే మిగిలిన చోట్ల ఆస్తులు ఉంచుకోలేదని శివాజీ చెప్పారు.

తాను చేసిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కారణంగా పదేళ్ల పాటు సినిమాలు చేయకున్నా బ్రతకగలిగాను అన్నారు. సినిమా నన్ను బతికించింది. నన్ను కాపాడింది సినిమా, వ్యాపారాలు మాత్రమే అని శివాజీ పేర్కొన్నారు. తాను ఏ రాజకీయ పార్టీ దగ్గరైనా చేయి చాచినట్లు నిరూపిస్తే ఈ క్షణమే చనిపోతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ నటించిన నైన్టీస్ అనే వెబ్ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది.