Elon Musk: ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుడు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్సా సీఈవో, ఎక్స్ జీఈవో అయిన మస్క్.. అనేక రంగాల్లో పెట్టుబడి పెట్టాడు. ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నాడు. ఇటీవలే నింగిలోకి ప్రైవేట్ జెట్‌లో ఐదుగురిని పంపించాడు. అంతరిక్ష యాత్రకు శ్రీకారం చుట్డాడు. మనిషి బ్రెయిన్‌లో చిప్ అమర్చే విధానంపై పరిశోధనలు చేయిస్తున్నారు. అంధులకు చూపి తెప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. అయితే ఆయన ఇటీవల తప్పుడు సమాచారం వ్యాప్తి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటెన్నాడు. దీనిపై విచారణ జరిపిన బ్రెజిల్ కోర్టు జరిమానా విధించింది. అయితే ఈ జరిమానాను కూడా మస్క్ తప్పుడు ఖాతాకు బదిలీ చేసి మరో తప్పు చేశాడు.
ఏం జరిగిందంటే..
బ్రెజిల్‌లో మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వేదికగా తప్పుడు సమచారం ప్రసారం చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో ఆ దేశంలో ఎక్స్‌ను నిషేధించింది. తప్పుడు సమాచారం ఫిర్యాదు చేయడంతో అక్కడి సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. తప్పుడు ప్రచారం చేస్తున్న ఎక్స్ ఖాతాలను తొలగించాలని కోర్టు మస్క్‌ను ఆదేశించింది. వాటిని తొలగించలేదు. దీంతో ప్రభుత్వం ఎక్స్‌ను ఆ దేశంలోనే నిషేధించింది. న్యాయమూర్తి తీర్పుపై మస్క్ ఎక్స్‌లో స్పందించాడు. వాక్ స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి పునాది. ప్రజామోదంఒతో ఎన్నిక కాని న్యాయమూర్తి ఈ పునాదిని రాజకీయ లబ్ధి కోసం నాశనం చేస్తున్నాడు అని పేర్కొన్నాడు. దుష్ప్రచారం నెపంతో తన ఖాతాలను బ్లాక్ చేయిస్తున్నాడని ఆరోపించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తెలిపాడు. జడ్జి ప్రజాభీష్టాన్ని విస్మరిస్తున్నాడని తెలిపారు. దీంతో బ్రెజిల్ నుంచి వస్తున్న ఆదాయం మొత్త పోతుందని పేర్కొన్నాడు. లాభం కంటే తమకు సిద్ధాంతాలే ముఖ్యమని వెల్లడించాడు.
ఇద్దరి మధ్య వాగ్వాదం..
ఈ విషయమై కోర్టులో జడ్జి, మస్క్ మధ్య వాగ్వాదం జరిగింది. మస్క్ న్యాయమూర్తిని ఉద్దేవించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వీటిని తీవ్రంగా పరిగణించిన జడ్జి తప్పుడు సమాచార వ్యాప్తిపై జరుగుతున్న విచారణలో మస్క్‌ను కూడా చేర్చారు. కోర్టు కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నాడని, తీర్పులకు వక్రభాష్యం చెబుతున్నాడని పేర్కొన్నారు. అందుకు ఎక్స్‌ను ఆయుధంగా వాడుకుంటున్నాడని తెలిపింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున కొందరికి మద్దతుగా నిలుస్తున్నాడని ఆరోపించింది. ఈనేపథ్యంలో కోర్టు మస్క్‌కు 5.2 మిలియన్ల (రూ.43 కోట్లు) జరిమానా విధించింది.
తప్పుడు ఖాతాలో జమ..
కోర్టుకు చెల్లించాల్సిన జరిమానా మొత్తాన్ని మస్క్ మరో ఖాతాకు బదిలీ చేశాడు. ఈ విషయాన్ని న్యాయమూర్తి మోరేస్ వెల్లడించాడు. ఎక్స్ జరిమానా మొత్తాన్ని చెల్లించిందని తెలిపారు. అయితే కోర్టు ఖాతాకు కాకుండా మరొక ఖాతాకు డబ్బులుఉ చెల్లించినట్లు వెల్లడింఆచారు. ఆ నిధులను వెంటనే కోర్టు ఖాతాలోకి మళ్లించాలని అధికారులను ఆదేశించారు.