Sandeep Reddy Vanga Vs Bollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగ ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ఇక అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఆయన బాలీవుడ్లో కబీర్ సింగ్, అనిమల్ లాంటి సినిమాలను చేసి బాలీవుడ్ హీరోలకు సైతం గొప్ప క్రేజీనైతే సంపాదించి పెట్టాడు. మరి ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే సందీప్ రెడ్డివంగ ను టచ్ చేసే కెపాసిటీ బాలీవుడ్ దర్శకులకు లేదు అంటూ కొన్ని కథనైలైతే వెలువడుతున్నాయి. ఎందుకంటే బాలీవుడ్ దర్శకుడు మన హీరోలకు ఏమాత్రం సక్సెస్ లను ఇవ్వడం లేదు. ఓం రావత్ ‘ ఆది పురుష్’ సినిమాతో ప్రభాస్ కి భారీ డిజాస్టర్ ని కట్టబెట్టాడు. ఇక జంజీర్ సినిమాతో అపూర్వ లఖియా రామ్ చరణ్ కి ఒక డిజాస్టర్ ని ఇచ్చాడు…
Also Read: మహేష్ బాబు ను ఫాలో అయి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు ఎవరో తెలుసా..?
రీసెంట్ గా వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ కి అయన్ ముఖర్జీ సైతం ఒక ఫ్లాప్ ని ఇచ్చాడనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో మన తెలుగు దర్శకుడు అయిన సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరోలకు భారీ సక్సెస్ ని అందిస్తుంటే బాలీవుడ్ దర్శకులు మాత్రం మన తెలుగు హీరోలకు డిజాస్టర్లను కట్టబెడుతున్నారు.
ఈ లెక్కన సందీప్ రెడ్డివంగా తో పోటీకి బాలీవుడ్ డైరెక్టర్లు ఎవరు పనికిరారని ఇండియాలో బాలీవుడ్ దర్శకుల కంటే కూడా సందీప్ రెడ్డివంగా గొప్ప దర్శకుడు అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం అతన్ని పొగుడుతున్నారు… ఇక రాబోయే సినిమాతో కూడా సందీప్ ఇలాంటి సక్సెస్ లను సాధించి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు పాన్ వరల్డ్ లో సైతం ఆయన తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించి 2000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది… స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కనిపించబోతున్నాడు. మరి ఈ క్యారెక్టర్ లో ప్రభాస్ ఎలా నటిస్తాడు సందీప్ తన మార్కును చూపిస్తూ ఈ సినిమాని ఎలా డీల్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…