spot_img
Homeఎంటర్టైన్మెంట్Rajinikanth Tweet Reaction Vijay TVK Issue: తమిళ హీరో విజయ్ పై సూపర్ స్టార్...

Rajinikanth Tweet Reaction Vijay TVK Issue: తమిళ హీరో విజయ్ పై సూపర్ స్టార్ రజినీకాంత్ ఫైర్.. సంచలనం రేపుతున్న ట్వీట్!

Rajinikanth Tweet Reaction Vijay TVK Issue: తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ రోజుకో వివాదం అలుముకుంటోంది. ఎక్కడ చూసిన ఆయన గురించే చర్చ. నిన్న మొన్నటి వరకు ప్రముఖ హీరోయిన్ త్రిష తో ఆయనకు ఉన్న అక్రమ సంబంధం , అదే విధంగా భార్య సంగీత విడాకుల వ్యవహారం లో తీవ్రమైన విమర్శలను ఎదురుకుంటూ వచ్చాడు విజయ్. సొంత అభిమానులు సైతం ఆయన చర్యలు తప్పుబట్టారు. ఇప్పుడు ఆయన TVK పార్టీ ప్రధాన కార్యదర్శి అదువ్ అర్జున సూపర్ స్టార్ రజినీకాంత్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) రాజకీయాల్లోకి రావాలని చూసి, ఆ తర్వాత ఆరోగ్యం సహకరించక ఆ ఆలోచనని విరమించుకున్న సంగతి తెలిసిందే.

Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!

ఈ అంశాన్ని అదువ్ అర్జున్ ప్రస్తావిస్తూ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు, DMK పార్టీ నేతలు ఆయన్ని బెదిరించారని, వాళ్లకు భయపడే రజినీకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలన్నీ DMK పార్టీ కి చెందిన రెడ్ జైన్ట్ ఫిలిమ్స్ సంస్థకు సంబంధించినవే అని, రజినీకాంత్ తో DMK పార్టీ నేతలు చీకటి ఒప్పదం చేసుకున్నారంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. రజినీకాంత్ అభిమానులు అయితే విజయ్ ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిడుతున్నారు. తక్షణమే మీ ప్రధాన కార్యదర్శి పై చర్యలు తీసుకుంటూ పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని, లేని పక్షంలో రజినీకాంత్ ఫ్యాన్స్ పవర్ ఎలాంటిదో చూస్తావని సోషల్ మీడియా లో విజయ్ కి వార్నింగ్ ఇస్తున్నారు. మరోవైపు విజయ్ ఫ్యాన్స్ కూడా అందుకు దీటుగా కొంతమంది కౌంటర్లు ఇస్తున్నారు. అయితే అదువ్ అర్జున చేసిన కామెంట్స్ పై రజినీకాంత్ స్పందిస్తూ నేడు ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘అదువ్ అర్జున్ నాపై చేసిన కామెంట్స్ లో ఎలాంటి నిజం లేదు. అతని వ్యాఖ్యలను ఖండిస్తూ నాకు మద్దతుగా నిల్చిన పళని స్వామి , బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ , కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ , మంత్రి రఘుపతి లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారితో పాటు తిరుమావళవన్ , ఎస్పీయే వేలుమణి , మిత్రుడు అన్నాదురై , అర్జున మూర్తి, జీకే వాసన్ , జాన్ పాండియన్ మరియు ఇతర రాజకీయ నాయకులకు ప్రత్యేక కృతఙ్ఞతలు. అదే విధంగా మా సినీ పరిశ్రమకు చెందిన అమీర్ , జీ ధనుంజయ్ వంటి వారు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. వాళ్లకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. కాలం మాట్లాడదు , వేచి ఉండి బదులిస్తుంది ‘ అంటూ చెప్పుకొచ్చాడు రజినీకాంత్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper