Rajinikanth Coolie Craze: సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) మరో 5 రోజుల్లో మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం తమిళ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలుగు ఆడియన్స్ అంతకంటే ఎక్కువ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు టికెట్ సేల్స్ మొదలు పెడుతారా?, ఎప్పుడెప్పుడు బుకింగ్ చేసుకుందామా అనేంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. కేవలం కేరళ అడ్వాన్స్ బుకింగ్స్ నిన్న బుక్ మై షో యాప్ లో గంటకు 50 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి.
కొన్ని బుక్ మై షో లో మాత్రమే కాకుండా కౌంటర్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టారు కేరలో లో. కౌంటర్ బుకింగ్స్ కోసం ఒక థియేటర్ లో వేలాది మంది ఆడియన్స్ తరళి రావడం, థియేటర్ యాజమాన్యం కంట్రోల్ చెయ్యలేక చేతులు ఎత్తేయడం తో అందరూ ఒక్కసారిగా గేట్స్ ని బద్దలు కొట్టుకొని లోపలకు రావడం సంచలనం గా మారింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దానిని మీరు చివర్లో చూడొచ్చు.
Also Read: వార్ 2 తెలుగు వెర్షన్ బుకింగ్స్ ఇలా ఉన్నాయేంటి?
వారం రోజుల ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక సినిమా విడుదల రోజు ఎలా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. జైలర్ తర్వాత రజనీకాంత్ నటించిన రెండు సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. దీంతో రజనీకాంత్ పని అయిపోయింది, ఇక ఆయన సినిమాకు వసూళ్లు రావు అని చాలా మంది అనుకున్నారు. కానీ సరైన కాంబినేషన్ తో రజినీకాంత్ సినిమా పడితే నేటి తరం స్టార్ హీరోలు కూడా ఆయన ముందు సరిపోరు అని మరోసారి రుజువు అయ్యింది. కేవలం యావరేజ్ టాక్ వచ్చినా చాలు,ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కుని అవలీల గా అందుకుంటుంది.
Massive fan craze storms theatres for just the advance booking of #Coolie in Thrissur, Kerala!#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja… pic.twitter.com/nYWOQNfHSg
— Sun Pictures (@sunpictures) August 8, 2025