Homeఎంటర్టైన్మెంట్Rajinikanth comments on Jana Nayagan: విజయ్ 'జన నాయగన్' పై సూపర్ స్టార్ రజినీకాంత్...

Rajinikanth comments on Jana Nayagan: విజయ్ ‘జన నాయగన్’ పై సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..

Rajinikanth comments on Jana Nayagan: తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) చివరి చిత్రంగా ప్రచారం అవుతూ , జనవరి 9 , 2026 వ సంవత్సరం లో , సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్రం , సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడంతో వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నెల 30 న విడుదల కాబోతుందని అంత అంటున్నారు కానీ , దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. అయితే ఈ సినిమా రాజకీయ కారణాల వల్లే, కుట్రతో సెన్సార్ సర్టిఫికేట్ ని రానివ్వకుండా చేస్తున్నారని విజయ్ నేడు ఒక సభలో ఆందోనళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ వీడియో నే కనిపిస్తుంది. ఇది కాసేపు పక్కన పెడితే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) ఈ చిత్రం పై స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ కి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని, రజినీకాంత్ చెన్నై కి విచ్చేశాడు. విమానాశ్రయం లోకి ఆయన అడుగుపెట్టిన వెంటనే మీడియా చుట్టుముట్టు పలు ప్రశ్నలు సంధించారు. ఒక విలేఖరి రజినీకాంత్ ని ప్రశ్న అడుగుతూ ‘విజయ్ జన నాయగన్ చిత్రాన్ని సెన్సార్ సర్టిఫికేట్ ఇప్పటి వరకు రాలేదు. ఆ కారణం చెర సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేకపోతున్నారు. దీనిపై ఒక సినీ అభిమాని గా మీరేమి మాట్లాడుతారు’ అని అడగ్గా, దానికి రజినీకాంత్ సమాధానం చెప్తూ ‘నో కామెంట్స్’ అని అంటాడు. అలా చెప్తున్నప్పుడు ఆయన ముఖం లోని ఎక్స్ ప్రెషన్స్ ని చూస్తే చాలా చిరాకు తో , కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెప్పినట్టుగా అనిపించింది. ఇప్పటి వరకు రజినీకాంత్ పై విజయ్ ఎలాంటి కామెంట్స్ చేయలేదు కానీ, విజయ్ మీద మాత్రం రజినీకాంత్ ఎన్నో సార్లు పరోక్షంగా సెటైర్లు విసిరాడు. ఎందుకో విజయ్ తీరు , పద్దతి రజినీకాంత్ కి నచ్చలేదని తెలుస్తోంది.

ఇక ఇదే మీడియా సమావేశం లో ఆయన తన తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. రీసెంట్ గానే ఆయన కమల్ హాసన్ తో కలిసి ఒక మల్టీస్టార్రర్ చిత్రం లో నటించబోతున్నట్టు ఒక అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందని ఒక విలేఖరి అడగ్గా , ఆగస్టు నుండి మొదలు అవుతుందని బదులిచ్చాడు రజినీకాంత్. అంతే కాకుండా , విడుదల తేదీని కూడా ఆ చిత్ర నిర్మాణ సంస్థ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version