Homeఅంతర్జాతీయంBalochistan violence: బయట పల్లకి మోత.. లోపల శవపేటిక మోత.. గల్ఫ్‌ యుద్ధం మాటున బలూచిస్తాన్‌లో...

Balochistan violence: బయట పల్లకి మోత.. లోపల శవపేటిక మోత.. గల్ఫ్‌ యుద్ధం మాటున బలూచిస్తాన్‌లో రక్తపాతం!

Balochistan violence: ప్రపంచం మొత్తం ఇరాన్‌–అమెరికా యుద్ధం, గల్ఫ్‌ సంక్షోభంపై దృష్టి సారించింది. యుద్ధం ఇంకా ఎన్నాళ్లు సాగుతుంది. ఎవరు గెలుస్తారు. ఎవరు ఎవరిపై దాడులుచేస్తున్నారు అని ఆలోచిస్తున్నారు. ఈ పందెట్లో సడేమియా అన్నట్లుగా పాకిస్తాన్‌ మధ్యవర్త్విం చేస్తున్నట్లు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కొరియర్‌ ఉద్యోగాలు చేసింది. కానీ పాకిస్తాన్‌ బయట పల్లకి మోత మోగించుకుంటుంది. కానీ అంతర్గతంగా బలూచిస్తాన్‌లో మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు కేవలం నాలుగు రోజుల్లో 65 దాడులు ఒక్క బలూచిస్తాన్‌లోనే జరిగాయి. బయటకు మాత్రం ‘మధ్యవర్తిత్వం వహిస్తున్న శాంతి దూత‘గా చిత్రించుకుంటున్న పాకిస్తాన్‌.. లోపల మాత్రం బలూచిస్తాన్‌లో విలయతాండవం సృష్టిస్తోంది.

నాలుగు రోజుల్లో 65 దాడులు..
మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 1 వరకు కేవలం నాలుగు రోజుల వ్యవధిలో బలూచిస్తాన్‌లోని 9 జిల్లాల్లో 65 సమన్వయ దాడులు జరిగాయి. బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) నిర్వహించిన ఈ ‘ఆపరేషన్‌ హెరాఫ్‌‘లో 84 నుంచి 86 మంది పాకిస్తాన్‌ సైనికులు, అధికారులు మరణించారు. 18 మంది కీలక అధికారులు బందీలుగా పట్టుపడ్డారు. పంజ్‌గుర్, షాపుక్, బసిమా, సిబి, మాస్తంగ్, క్వెట్టా, నుష్కి, ఝాల్‌ మాగ్సి, ఖారన్‌ తదితర జిల్లాల్లో దాడులు జరిగాయి. పోలీస్‌ స్టేషన్లు, హై–సెక్యూరిటీ జైళ్లు, మిలటరీ క్యాంపులు, ఎయిర్‌ బేస్‌ రాడార్లు, గ్యాస్‌ పైప్‌లైన్లు, రైల్వే ట్రాక్‌లు లక్ష్యంగా దాడులు జరిగాయి.

14 నిమిషాల వీడియో విడుదల..
బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ తన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌ ‘హక్కల్‌‘లో ఈ దాడులకు సంబంధించిన 14 నిమిషాల నిడివి గల వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ధ్వంసమైన పాకిస్తాన్‌ మిలటరీ కాన్వాయ్‌లు, కూలిపోయిన శంషేర్‌ ఎయిర్‌ బేస్‌ రాడార్‌ వ్యవస్థ, మృతదేహాలుగా పడిఉన్న పాక్‌ జవాన్లు, అధికారులు, మండిపోతున్న పోలీస్‌ స్టేషన్లు, ప్రభుత్వ భవనాలు, క్వెట్టా ఈస్టర్న్, వెస్టర్న్‌ బైపాస్‌లపై దాడుల దృశ్యాలు ఉన్నాయి.

కీలక అధికారుల బందీ..
సాధారణ జవాన్లు బందీ అయితే పాకిస్తాన్‌ పెద్దగా పట్టించుకోదు. కానీ, 18 మంది కీలక అధికారులు(సీనియర్‌ ఆర్మీ ఆఫీసర్స్, ఇంటెలిజెన్స్‌ అధికారులు) బందీ కావడం ఇస్లామాబాద్‌కు తీవ్రమైన సవాలుగా మారింది. వీరిని విడిపించడానికి పాకిస్తాన్‌ ఇప్పుడు బేరసారాలు చేయాల్సిన పరిస్థితి. బీఎల్‌ఏ గతంలో కూడా బందీలను విడిపించడానికి భారీ ఖైదీల మార్పిడికి డిమాండ్‌ చేసింది.

నిజాలు దాచే ప్రయత్నం
ఈ భారీ దాడుల గురించి పాకిస్తాన్‌ ప్రధాన మీడియాలో ఒక్క వార్త కూడా రాలేదు. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఈమేరకు చర్యలు తీసుకుంది. దాని స్థానంలో ఇరాన్‌–అమెరికా మధ్యవర్తిత్వం వార్తలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. పాకిస్తాన్‌ పాత్రను అతిశయోక్తిగా చిత్రించి, అంతర్జాతీయ దృష్టిని మళ్లించింది. సోషల్‌ మీడియాలో బలూచిస్తాన్‌ వార్తలను సెన్సార్‌ చేసింది. కానీ, బీఎల్‌ఏ విడుదల చేసిన వీడియోలు, అంతర్జాతీయ మీడియా వార్తలతో నిజాలు బయటపడుతున్నాయి.

ఎందుకు ఈ తిరుగుబాటు?
బలూచిస్తాన్‌లోని సహజ వనరులు గ్యాస్, బొగ్గు, బంగారం, రాగి వనరులను పంజాబ్‌ ప్రావిన్స్‌కు పాకిస్తాన్‌ తరలిస్తోంది. వనరులు ఉన్నా, స్థానికులకు నీరు, విద్యుత్, ఉద్యోగాలు లేవు. పాకిస్తాన్‌ ఆర్మీ అత్యంత క్రూరమైన పద్ధతుల్లో తిరుగుబాటుదారులను అణిచివేస్తోంది. బలూచీ భాష, సంస్కృతిపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

బీఎల్‌ఏ బలం ఎలా పెరిగింది?
బీఎల్‌ఏ కూడా కొన్ని రోజులుగా బలం పుంజుకుంటోంది. ఆత్మాహుతి దాడులను ‘ఫిదాయీ ఆపరేషన్స్‌‘గా మార్చి, యువతను ఆకర్షిస్తోంది. భారత్, పశ్చిమ దేశాల నుంచి పరోక్ష మద్దతు లభిస్తోంది. యూట్యూబ్, ట్విట్టర్‌ ద్వారా ప్రపంచానికి తమ పోరాటాన్ని చేరువ చేస్తోంది. ఒకేసారి అనేక ప్రాంతాల్లో దాడులు చేసి, పాక్‌ సైన్యాన్ని అస్తవ్యస్తం చేస్తోంది.

నామమాత్రంగా పాకిస్తాన్‌ ప్రభుత్వం..
బలూచిస్తాన్‌లో పాకిస్తాన్‌ ప్రభుత్వ అధికారం కేవలం క్వెట్టా నగరం వరకే పరిమితమైందని, మిగిలిన ప్రాంతాలన్నీ బీఎల్‌ఏ, ఇతర వేర్పాటువాద సంస్థల నియంత్రణలో ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పగటిపూట పాక్‌ సైన్యం నియంత్రణలో ఉన్న ప్రాంతాలు, రాత్రిపూట బీఎల్‌ఏ వశమవుతున్నాయి. క్వెట్టా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే హైవేలు, బైపాస్‌లు బీఎల్‌ఏ దాడులకు గురవుతున్నాయి. పాక్‌ సైనిక స్థావరాలే ప్రధాన టార్గెట్‌లుగా మారాయి.

పాకిస్తాన్‌ మీడియా బ్లాక్‌అవుట్, అంతర్జాతీయ దృష్టి మళ్లించే వ్యూహాలు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. బీఎల్‌ఏ విడుదల చేసిన 14 నిమిషాల వీడియో, 84 మంది జవాన్ల మరణం, 18 మంది అధికారుల బందీ ఇవన్నీ దాచలేని నిజాలు. పాకిస్తాన్‌ ఇప్పుడు ఎంచుకునే మార్గమే ఆ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version