https://oktelugu.com/

Rajinikanth And Pawan Kalyan: రజినీకాంత్, పవన్ కళ్యాణ్ ఇద్దరు వాళ్ల సినిమాలతో బాక్సాఫీస్ ను ఊచకోత కోయబోతున్నారా..?

సినిమా అనేది ప్రతి ఒక్కరి కల...ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకంగా సినిమాలో కనిపించాలని తద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకోవాలని కోరుకుంటారు.కానీ అది అందరికీ సాధ్యమవ్వదు .

Written By:
  • Gopi
  • , Updated On : October 6, 2024 / 11:59 AM IST

    Rajinikanth And Pawan Kalyan

    Follow us on

    Rajinikanth And Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక హీరో గానే కాకుండా ప్రస్తుతం పొలిటిషన్ గా కూడా తన బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అలాగే సినిమాలను కూడా వదిలేయకుండా అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన మూడు సినిమాలను సెట్స్ మీద ఉంచాడు. అందులో సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఓ జి సినిమా ఒకటి. ఇక ఈ మూవీ అందరిలో విపరీతమైన అంచనాలు రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నింటిలో ఈ సినిమాకి చాలా ఎక్కువ క్రేజ్ ఉందనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా అలరిస్తుంది…

    ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు రజినీకాంత్… 70 సంవత్సరాలకు పైబడిన వయసులో కూడా హీరోగా రాణిస్తూ ప్రేక్షకులందరి చేత విజిల్స్ వేయించ గల సత్తా ఉన్న హీరో రజనీకాంత్.. అలాంటి రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ‘కూలీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తుండటం విశేషం… ఇక వచ్చే సంవత్సరం ఈ సినిమా థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఒక కొత్త అనుభూతిని నింపడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే రజనీకాంత్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

    ఇక గత సంవత్సరం నెల్సన్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే వరుసగా పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే లోకేష్ కనకరాజు కూడా విక్రమ్ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. కమలహాసన్ కెరియర్ లోనే అదిరిపోయే సక్సెస్ ని అందించిన డైరెక్టర్ గా కూడా లోకేష్ కనకరాజ్ చరిత్రలో నిలిచాడు…

    ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఓజీ, రజనీకాంత్ కూలీ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ రికార్డ్ లను కొల్లగొడతాయి అంటూ ఇప్పుడు చాలామంది సినీ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాల మీద విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అవుతుంది. మరి వీళ్ళిద్దరికీ ఎందుకు అంత క్రేజ్ ఉంది అనే విషయం పక్కన పెడితే ఈ ఇద్దరు కూడా యూనిక్ గా ఉండటం, సినిమాల పట్ల గాని సమాజం పట్ల గాని వాళ్ళు తీసుకునే బాధ్యతను బట్టి వాళ్ళ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనేది తెలుస్తుంది…