Rajinikanth And Kamal Haasan: కమల్ హాసన్(Kamal Hassan) నిర్మాతగా, సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో గా, ఒక సినిమాని మొదలు పెట్టి రెండు నెలలు అయ్యింది. సుందర్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కబోతుందని అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, సుందర్ మధ్యలోనే తప్పుకున్నాడు. అందుకు కారణాలు ఏంటో కూడా చెప్పలేదు. దీనిపై కోలీవుడ్ లో పెద్ద చర్చనే నడిచింది. అసలు ఎందుకు ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు?, కథలో ఏమైనా లోపం ఉందా? అనే సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి డైరెక్టర్ దొరికేశాడు. ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించబోతున్నాడని కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. గతం లో సిబి చక్రవర్తి ‘డాన్’ అనే చిత్రం చేసాడు. శివ కార్తికేయన్ హీరో గా నటించిన ఈ సినిమా 2022 వ సంవత్సరం లో విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
అలాంటి యంగ్ డైరెక్టర్ చేతిలో ఇలాంటి మెగా ప్రాజెక్ట్ పెట్టడం ఎంత వరకు సేఫ్ అని అభిమానులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రస్తుత తరానికి నచ్చేట్టుగా కేవలం యంగ్ డైరెక్టర్స్ మాత్రమే తెరకెక్కించగలరు. టాప్ డైరెక్టర్స్ కంటే, వీళ్ళతో సినిమాలు చేయడమే బెస్ట్. రీసెంట్ గానే యంగ్ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ తో ఓజీ లాంటి సినిమాని తీసి ఎలాంటి బ్లాక్ బస్టర్ ని అందించాడో మనమంతా చూసాము. అదే విధంగా వరుస ఫ్లాప్స్ లో ఉన్నటువంటి కమల్ హాసన్ కి కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించినది యంగ్ డైరెక్టర్ మాత్రమే. అలాంటి యంగ్ డైరెక్టర్ చేతిలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పెట్టడం సురక్షితమే అని అంటున్నారు విశ్లేషకులు. ఈ ఏడాది సమ్మర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే మొదట్లో ఇది కమల్ హాసన్, రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టార్రర్ చిత్రమని పెద్ద ప్రచారం జరిగింది. కానీ ఇది మల్టీస్టార్రర్ కాదు, కేవలం రజినీకాంత్ మాత్రమే హీరో గా నటిస్తాడు , కమల్ హాసన్ కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడు అని క్లారిటీ వచ్చింది. మరి ఈ సినిమాలో కమల్ హాసన్ కనీసం స్పెషల్ రోల్, లేదా గెస్ట్ రోల్ లో అయినా కనిపిస్తాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే, ఈ ప్రాజెక్ట్ కి షిఫ్ట్ అవ్వనున్నాడు రజినీకాంత్.