Rajinikanth & Amitabh Bachchan : ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అమితాబచ్చన్ (Amithabachhan) కి చాలా మంచి గుర్తింపైతే ఉండేది. ఆయన చేసిన సినిమాలన్నీ ఇండియా వైడ్ గా మంచి పాపులారిటిని సంపాదించుకునేవి… ముఖ్యంగా షోలే సినిమాకైతే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఆ సినిమాని చూడని ప్రేక్షకుడు లేడనే చెప్పాలి… ఇక తనతోపాటుగా సౌత్ సినిమా ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి ఎదిగిన నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) వరుస సినిమాలు చేస్తూ ఆయనకంటూ ఒక క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా సినిమాల మీద సినిమాలతో ఎక్కువగా ఇండస్ట్రీ హిట్లను సాధించిన ఘనత కూడా రజనీకాంత్ కే దక్కుతుంది. ఆయన ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది.
Also Read : రజినీకాంత్ కూలీ లో నాగార్జున నట విశ్వరూపం చూడబోతున్నామా..?
ఇక ఇలాంటి రజనీకాంత్ కి సైతం చెమటలు పట్టించిన హీరో ఒకరు ఉన్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి… అటు అమితాబచ్చన్, ఇటు రజనీకాంత్ నుంచి ఎదురయ్యే పోటీని తప్పుకొని మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకున్న చిరంజీవి ఒకానొక సందర్భంలో వీళ్ళిద్దరినీ క్రాస్ చేసి ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా అవతరించాడనే విషయం మనలో చాలామందికి తెలియదు.
1997 వ సంవత్సరంలో ఫోబ్స్ అనే పత్రిక చిరంజీవిని ఉద్దేశిస్తూ ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అంటూ ఒక మ్యాగ్జైన్ ను వదలడం అప్పట్లో పెను సంచలనాలను సృష్టించింది. ఇక అలాగే కే బాలచందర్ లాంటి గొప్ప దర్శకుడు సైతం చిరంజీవి లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. చిరంజీవి క్లాస్ మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు. ఎంటైర్ చిరంజీవి కెరియర్ లో కమర్షియల్ సినిమాలతోనే కాకుండా ఆర్ట్ సినిమాలను కూడా చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అందువల్లే ఆయన సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకులు అభిమానులుగా మారిపోయారు.
తద్వారా చిరంజీవి లాంటి హీరో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరనేంత గుర్తింపును కూడా పొందిన ఆయన ఈ ఏజ్ లో సైతం హీరోగా రాణిస్తూ భారీ కష్టాన్ని ఎదుర్కొంటూనే మంచి విజయాలను సాధించడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు… చూడాలి మరి ఇక మీదట కూడా ఆయన మరిన్ని గొప్ప విజయాలను అందుకుంటాడా లేదా అనేది…
Also Read : ‘జై హనుమాన్’ మూవీ ఆగిపోయినట్టేనా..?అసలు ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడు..?