Rajinikanth : సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు…హీరోల విషయం పక్కన పెడితే దర్శకులు మాత్రం భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. పాన్ ఇండియాలో వాళ్ల హవాను కొనసాగిస్తూ ఇండియాలో వాళ్ళను మించిన దర్శకులు ఎవరు లేరనే రేంజ్ లో సక్సెస్ ని సాధించాలని చూస్తున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ‘విక్రమ్’ సినిమాతో లోకేష్ కనకరాజ్ పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు…
లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న కూలీ (cooli) సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేయబోతుందంటూ కొన్ని వార్తలైతే వినపడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని రజనీకాంత్ తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలు ఒకత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న లోకేష్ కనకరాజ్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం. ఇక రజనీకాంత్ ఈ ఏజ్ లో మాఫీయా డాన్ గా చూపించడానికి తను సిద్ధమయ్యాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ధృడ సంకల్పంతో లోకేష్ కనకరాజ్ ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : రజినీకాంత్ జైలర్ 2 కోసం సిద్ధమవుతున్న చిరంజీవి, బాలయ్య… ఇద్దరిలో ఎవరు ఫైనల్ అయ్యారు..?
ఇక ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు మనం చాలామంది విలన్లని చూశాం…కానీ నాగార్జున విలనిజాన్ని ఈ సినిమాలో పర్ఫెక్ట్ చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నాగార్జునలో ఈ యాంగిల్ కూడా ఉందా? అని ఆశ్చర్యపోతారు అంటు లోకేష్ కనకరాజు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
ఇక విక్రమ్ సినిమాలో లాస్ట్ ఐదు నిమిషాలు కనిపించిన సూర్య రోలెక్స్ పాత్రలో ఎలాంటి గుర్తింపును సంపాదించుకున్నాడో మనందరికి తెలిసిందే. ఇక అంతకు మించిన విలనిజాన్ని నాగార్జున ఈ సినిమాలో చూపించబోతున్నాడట. ఇక తన నటన ఏ రేంజ్ లో ఉంటుందో మన ఊహకే వదిలేసినట్టుగా దర్శకుడు ప్రతి ఒక్కరిలో అంచనాలైతే పెంచేశాడు.
మరి ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందా? నాగార్జున పాత్రకి మంచి గుర్తింపు లభిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… రజనీకాంత్ లాంటి స్టార్ హీరో దొరికితే ఎవరైనా సరే భారీ విజయాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక లోకేష్ కనకరాజ్ కూడా అందుకోసమే తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది…