https://oktelugu.com/

Rajini Kanth: రజినీకాంత్ ” పెద్దన్న ” మూవీ ట్రైలర్ రిలీజ్…

Rajini Kanth: సూపర్‌స్టార్, దాదాసాహెబ్ ఫాల్కే రజినీకాంత్ నటించిన చిత్రం ‘అన్నాత్తే’. దీనిని తెలుగులో ” పెద్దన్న ” పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న రజినీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉందని చెప్పాలి. శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాని… సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నయనతార హీరోయిన్‌ గా నటిస్తుండగా… కీర్తి సురేష్ రజినీకాంత్ చెల్లెలి క్యారెక్టర్ లో కనిపించనుంది. అయితే ” పెద్దన్న ” […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 28, 2021 / 11:20 AM IST
    Follow us on

    Rajini Kanth: సూపర్‌స్టార్, దాదాసాహెబ్ ఫాల్కే రజినీకాంత్ నటించిన చిత్రం ‘అన్నాత్తే’. దీనిని తెలుగులో ” పెద్దన్న ” పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దేశ విదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న రజినీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉందని చెప్పాలి. శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాని… సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నయనతార హీరోయిన్‌ గా నటిస్తుండగా… కీర్తి సురేష్ రజినీకాంత్ చెల్లెలి క్యారెక్టర్ లో కనిపించనుంది. అయితే ” పెద్దన్న ” మూవీ నుంచి ఇటీవల ఓ సర్ ప్రైజ్ ఇచ్చింది మూవీ టీమ్.

    ఈ సినిమా ట్రైలర్ ను బుధవారం విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ ట్రైలర్ లో  రజినీ స్టైల్, మేనరిజమ్స్, డైలాగ్స్‌ హైలైట్ అని చెప్పాలి. అలానే సిస్టర్ సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయని అనిపిస్తుంది. ప్రముఖ హీరోయిన్లు మీనా, ఖుష్బూ కీలకపాత్రల్లో నటించారు. అలానే జగపతి బాబు, అభిమన్యు సింగ్, ప్రకాష్ రాజ్ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్ చేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రోమోలు సినిమా మీద అంచనాలు పెంచాయి. ఈ ట్రైలర్తో రజినీ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.

    ‘పెద్దన్న’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న తెలుగు, తమిళ్‌లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇటీవల ఈ మూవీ టీజర్ ను విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేశారు.  తెలుగులో ఈ సినిమా హక్కులను ఏషియన్ సినిమాస్… రూ. 12 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.