Homeఆంధ్రప్రదేశ్‌Newlywed couple: ప్రేమ పెళ్లికి పెద్దలు నో.. అన్నవరంలో పెళ్లి.. ప్రేమజంటను వెంటాడిన దురదృష్టం

Newlywed couple: ప్రేమ పెళ్లికి పెద్దలు నో.. అన్నవరంలో పెళ్లి.. ప్రేమజంటను వెంటాడిన దురదృష్టం

Newlywed couple: మరో ప్రేమ జంట కథ విషాదాంతమైంది. ప్రేమించుకుని పెళ్లి చేసుకుని చివరకు ప్రాణాలు విడిచారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుని వేరే కాపురం పెట్టినా వారు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో తెలియడం లేదు. కుటుంబసభ్యుల ఆదరణ దక్కలేదనే కారణంతోనే వారు తనువులు చాలించినట్లు భావిస్తున్నారు. పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నా జీవితంలో స్థిరపడకపోవడంతో బతుకుపై భయంతోనే ఇలా చేశారేమోననే అనుమానాలు వస్తున్నాయి.
Newlywed couple
శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం తునివాడ గ్రామానికి చెందిన హరీష్ (29), దివ్య (21) లు ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. ఇద్దరివి ఎదురెదురు ఇళ్లు కావడంతో ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడింది. హరీష్ ఎంబీఏ చదివి ఉద్యోగ వేటలో ఉన్నాడు. దివ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇద్దరు ఒకరినొకరు కలుసుకునే వారు. దీంతో ఇద్దరి ఇళ్లలో వీరి ప్రేమ విషయం తెలిసింది.

ఇద్దరివి ఒకే సామాజిక వర్గాలైనా వారి పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరు ఇళ్లు విడిచి వెళ్లిపోయి సెప్టెంబర్ 1న అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం విశాఖపట్నంలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కానీ ఇటీవల వారి సొంతూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Also Read: పిల్లలున్న తల్లినే వలచాడు.. కుదరకపోయే సరికి నరికాడు

తునివాడకు వచ్చి హరీష్ ఇంటికి వెళ్లారు. దీంతో హరీష్ తన తల్లిని పట్టుకుని తప్పు చేశానని ఏడ్చినట్లు తెలుస్తోంది. ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు కలిసి మేడపై ఉన్న గదికి వెళ్లారు. సెల్ కిందే మరిచిపోవడంతో చుట్టాలబ్బాయి సెల్ ఇచ్చేందుకు పైకి వెళ్లగా ఇద్దరు విగతజీవులుగా కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరు ఉరివేసుకుని చనిపోవడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తానికి మరో ప్రేమ జంట జీవితాన్ని చాలించడంపై అందరిలో ఆందోళన పెరిగింది.

Also Read: నాలుగేళ్లుగా అక్కను.. మత్తు మందు ఇచ్చి 17 ఏళ్ల ఆమె చెల్లిపై రేప్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version