Homeఎంటర్టైన్మెంట్Leo Collection: విజయ్ లియో సినిమా కలెక్షన్లు ఫేక్ అంటున్న రజినీ ఫ్యాన్స్?

Leo Collection: విజయ్ లియో సినిమా కలెక్షన్లు ఫేక్ అంటున్న రజినీ ఫ్యాన్స్?

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమెరికాలో కూడా ఈయనకు అభిమానులు ఉంటారు. అయితే రీసెంట్ గా జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ స్టార్ హీరో.

Leo Collection: స్టార్ హీరోల అభిమానులు మా హీరో గొప్పంటే.. మా హీరో గ్రేట్ అంటూ తెగ గొడవలు పెట్టుకుంటారు. కొన్ని సార్లు సోషల్ మీడియాలో ఈ వారే ఎక్కువగా నడుస్తుంటుంది. ప్రస్తుతం కూడా అదే వార్ నడుస్తుంది. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరోల అభిమానుల మధ్య ఈ వార్ మరింత పెరిగింది. ఇంతకు ఏం జరుగుతుంది? ఆ హీరోలు ఎవరంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమెరికాలో కూడా ఈయనకు అభిమానులు ఉంటారు. అయితే రీసెంట్ గా జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ స్టార్ హీరో. ఈ సినిమా థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది కూడా. సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి నెల రోజుల పాటు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. అదే రేంజ్ లో రజినీకాంత్ కు సాలిడ్ కంబ్యాక్ ను ఇచ్చింది ఈ సినిమా. ఈ సినిమా కంటే ముందు పెద్ద హిట్ లు లేకపోవడంతో రజినీ కెరీర్ అయిపోయినట్టే అనుకున్నారు. కానీ జైలర్ తో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.

ఏకంగా రూ. 650 కోట్లు రాబట్టి రిజినీ కెరీర్ లోనే కాదు కోలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలోనే సెకండ్ హయ్యెస్ట్ గ్రాస్డ్ సినిమాగా నిలిచింది జైలర్.ఈ సినిమా బుక్ మై షోలో దాదాపు 6 లక్షలకి పైగా టికెట్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది.అది కూడా విడుదలైన మొదటి వారానికే కావడం విశేషం. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు కన్నా 3, 4, 5 రోజుల్లో జైలర్ సినిమా ఎక్కువ బుకింగ్స్ ని రాబట్టింది. ఈ 6 మిలియన్ టికెట్స్ లో 1.5 మిలియన్ టికెట్స్ జైలర్ సినిమాని రెండో సారి చూడడానికి బుక్ చేసుకున్నారు.

అయితే రజినీ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ మా హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన లియో సినిమాతో హిట్ అందుకున్నారు విజయ్. అయితే బుక్ మై షోలో మా సినిమా ఎక్కువ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది అంటే కాదు మా సినిమానే ఎక్కువ చేసుకుంది అంటూ విజయ్ ఫ్యాన్స్, రజినీ ఫ్యాన్స్ వార్ కి దిగుతున్నారు. లియో సినిమా మొదటి వారంలో 7 మిలియన్ టికెట్స్ ని సొంతం చేసుకుందని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే జైలర్ సినిమా కలెక్షన్స్ ని ఇప్పటికే బ్రేక్ చేయాలి కదా కానీ అలా జరగలేదు అంటే ఫేక్ అనే అర్ధం అని రజినీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఇద్దరి స్టార్ల మద్య వార్ లియో థియేట్రికల్ రన్ ఎండ్ అయ్యే వరకూ జరుగుతూనే ఉంటుంది కావచ్చు. ఈ సినిమా విజయ్ కెరీర్ లో కలెక్షన్ల కింగ్ గానే ఉంది. అయినా ఈ సినిమా విడుదలై వారం కూడా అవడం లేదు. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి లాంగ్ రన్ లో జైలర్ సినిమాను బ్రేక్ చేస్తుందేమో వేచి చూడాలి అని విజయ్ ఫ్యాన్స్ అంటున్నారు. మరి చూడాలి ఎవరు ఈ విషయంలో కింగ్ గా నిలుస్తారో?

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper