Bigg Boss 7 Telugu: అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి స్టార్ మా బ్యాచ్. వీరికి సీరియల్ బ్యాచ్ అనే ముద్ర పడింది. అందరూ కలిసి జట్టుగా ఆడతారు. ఒకరిని మరొకరు నామినేట్ చేయరు. ఈ బ్యాచ్ ని చూసే శివాజీ తన టీమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అమర్ దీప్,ప్రియాంక, శోభా టీమ్ గేమ్ ఆడుతున్నారంటే మరలా ఒప్పుకోరు. పల్లవి ప్రశాంత్ ని శివాజీ సపోర్ట్ చేస్తున్నారని పైగా ఎద్దేవా చేస్తారు. పల్లవి ప్రశాంత్ ని శివాజీ సపోర్ట్ చేస్తున్నాడనేది ఎంత నిజంతో అమర్, ప్రియాంక, శోభా గ్రూప్ గా ఆడుతున్నారనేది కూడా నిజం.
తాజా వీడియోతో ఈ విషయం మరోసారి రుజువైంది. బుధవారం నుండి హౌస్లో నెక్స్ట్ కెప్టెన్సీ ప్రక్రియ మొదలైంది. బిగ్ బాస్ మారథాన్ లో భాగంగా ప్రతి టాస్క్ లో గెలిచిన హౌస్ మేట్ కెప్టెన్సీ కంటెండర్ గా రేసులో ఉంటారు. ప్రతి టాస్క్ లో నలుగురు పోటీ పడతారు. అందరి కంటే చివరిగా టాస్క్ పూర్తి చేసిన హౌస్ మేట్ రేసు నుండి తప్పుకుంటారు. దీనిలో భాగంగా ‘ఫ్లోట్ ఆర్ సింక్’ అనే టాస్క్ కండక్ట్ చేశారు.
సంచాలక్ చూపించే వస్తువు నీళ్లలో మునుగుతుందా? తేలుతుందా? అనేది చెప్పాలి. ఈ టాస్క్ లో ప్రియాంక, అమర్, శోభా, తేజ పోటీపడ్డారు. ప్రియాంక గెలవగా, శోభా రెండో స్థానంలో నిలిచింది. తేజా-అమర్ మధ్య టై అయ్యింది. ఇద్దరి మధ్య మరోసారి టాస్క్ నిర్వహించాడు సంచాలక్ గౌతమ్. అప్పుడు సీరియల్ బ్యాచ్ ప్లాన్ వేశారు. ఫ్రాడ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశారు. సరైన సమాధానాలు అమర్ కి శోభా, ప్రియాంక సిగ్నల్స్ తో చెప్పాలని రహస్యంగా చెప్పుకున్నారు.
ఈ వీడియోతో వారి బండారం బయటపడింది. అయినా… తేజానే గెలవడం విశేషం. వాళ్ళు ఎంతగా సహాయం చేసినా అమర్ సరైన సమాధానాలు చెప్పలేదు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఒక ప్రక్క దూసుకుపోతున్నాడు. బాక్సులు సెట్ చేసే ఫజిల్ టాస్క్ ప్రశాంత్ జస్ట్ 20 సెకండ్స్ లో పూర్తి చేశాడు. పోటీలో ఉన్న యావర్, గౌతమ్, రతిక అతడికి పోటీ ఇవ్వలేకపోయారు.
Eamcet exam ah enti idi 😂#Amardeep #ShobhaShetty #PriyankaJain coding their sign language.#BiggBossTelugu7 pic.twitter.com/Tne4C7bwMM
— TeluguBigg (@TeluguBigg) October 26, 2023