Robin Hood Movie : మాచర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ వంటి వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నితిన్(Hero Nithin), ఇప్పుడు ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. గతం లో నితిన్ తో ‘భీష్మ’ లాంబ్ట్ సూపర్ హిట్ సినిమాని తీసిన వెంకీ కుడుముల(Venky Kudumula) ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు. వరుస ప్లాపుల్లో ఉన్న శ్రీలీల(Srileela) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడం అందరికీ అవసరమే. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి రెండు పాటలు, ఒక టీజర్ విడుదలైంది, కానీ ఒక్క దానికి కూడా సరైన బజ్ క్రియేట్ అవ్వలేదు. సినిమా మీద హైప్ అసలు రావడం లేదు. చూస్తుంటే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ గట్టిగా దెబ్బ పడేలా అనిపిస్తుంది. ఈ సినిమాకి ఉన్న ఏకైక పాజిటివ్ ఏదైనా ఉందా అంటే ‘పుష్ప 2’ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నుండి విడుదల అవుతున్న సినిమా అనే పేరు మాత్రమే.
Also Read : నాని ఊర మాస్ సినిమాలు చేయడం వెనక అసలు కారణం ఇదేనా..?
మార్చి 28 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు ‘మ్యాడ్ స్క్వేర్’ అనే చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ రెండిట్లో యూత్ ఆడియన్స్ ఎక్కువగా ‘మ్యాడ్ స్క్వేర్’ కోసమే ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా ప్రభావం ‘రాబిన్ హుడ్’ పై చాలా బలంగా పడేలా అనిపిస్తుంది. అదంతా పక్కన పెడితే ‘రాబిన్ హుడ్’ చిత్రం లో ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా లో టాప్ మోస్ట్ ఫామ్ లో ఉండే డేవిడ్ వార్నర్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కి కెప్టెన్ గా వ్యవహరించి రెండు సార్లు ట్రోఫీ ని అందించిన సంగతి తెలిసిందే. అందుకే వార్నర్ అంటే మన తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకమైన అభిమానం.
అంతే కాకుండా వార్నర్ కి కూడా మన తెలుగు ఆడియన్స్, అదే విధంగా మన తెలుగు సినిమాలంటే విపరీతమైన ఇష్టం. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో మన టాలీవుడ్ స్టార్స్ ని ఇమిటేట్ చేస్తూ ఒక రేంజ్ లో వైరల్ అయ్యాడు. అల్లు అర్జున్ ఒక విధంగా అంతర్జాతీయ లెవెల్ లో పాపులర్ అయ్యాడంటే, అందుకు కారణం డేవిడ్ వార్నర్ కూడా అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత ఏడాది ఆయన రాజమౌళి తో కలిసి ఒక యాడ్ లో కనిపించాడు. ఈ ఏడాది నితిన్ తో కలిసి ‘రాబిన్ హుడ్’ సినిమాలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా కోసం వార్నర్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. సినిమా మీద ఉన్న అమితమైన ఇష్టం కారణంగానే ఆయన ఈ సినిమాలో నటించినట్టు తెలుస్తుంది.
Also Read : కమల్ హాసన్ చేతిలో అల్లు అర్జున్ కవర్ ఫోటో..ఆయన సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన రేంజ్ నుండి ఈ స్థాయికి!