Rajendra Prasad- Ramaprabha and NTR: సినిమా పరిశ్రమలో బంధుత్వాలదే పెద్దపీట. అందుకే సినిమాల్లో రాణించాలంటే ఏదో ఒక బంధం ఉండాల్సిందే. లేకపోతే పైకి రావడం కష్టమే. ఏదో ఒక వంకతో సినిమాల్లో తన సత్తా చాటాలంటే వెనుక నుంచి పుషింగ్ ఉండాల్సిందే. అదే కోవలో మన కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ కూడా వస్తారు. ఎన్టీఆర్ ను తన మార్గనిర్దేశకుడిగా భావించిన రాజేంద్ర ప్రసాద్ ది కూడా ఎన్టీఆర్ ఊరు నిమ్మకూరే అని తెలుసా? పైగా ఇద్దరు ఇళ్లు పక్కపక్కనే ఉంటాయట. అందుకే రాజేంద్ర ప్రసాద్ కు పుషింగ్ వచ్చిందంటే పొరపాటే. ఆయన సొంత టాలెంట్ తో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

నటనపై ఉన్న మక్కువతో ఓ సారి ఎన్టీఆర్ విజయవాడ వచ్చినప్పుడు రాజేంద్రప్రసాద్ వెళ్లి కలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాల్లో రాణించాలంటే మనకంటూ ఓ ప్రత్యేకతను చూపించుకోవాలి. లేకపోతే రాణించడం కష్టమే. దీంతో ఆయన కామెడీనే తన ఇంటిపేరుగా మార్చుకుని రెచ్చిపోయి సినిమాలు తీశారు. అందరిచేత శభాష్ అనిపించుకున్నారు. చలనచిత్ర రంగంలో కామెడీ చేయగలిగింది ఒక్క రాజేంద్ర ప్రసాదే అనే ముద్ర వేసుకున్నారు.ఇక తిరిగి చూడలేదు.
Also Read: Sreeleela: ‘శ్రీలీల’ రెట్టింపు అందం కోసం ఇలా చేస్తోందా ?
మరో లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమాప్రభ. ఈమె రాజేంద్రప్రసాద్ కు స్వయానా పిల్లనిచ్చిన అత్త. శరత్ బాబును పెళ్లి చేసుకున్న రమాప్రభకు పిల్లలు లేరు. దీంతో చెల్లెలి కూతురును దత్తత తీసుకుని రాజేంద్రప్రసాద్ కు ఇచ్చి వివాహం చేశారు.దీంతో రాజేంద్ర ప్రసాద్ కు రమాప్రభ కుటుంబం కూడా అండగా ఉంది. రమాప్రభకు అవకాశాలు తగ్గడంతో మదనల్లిలో ఉంటోంది.

ఇలా సినిమా పరిశ్రమలో ఒకరికి మరొకరికి ఏదో విధంగా సంబంధం ఉంటుంది. అందుకే వారు సినిమాల్లో రాణిస్తున్నారు. తమ టాలెంట్ కు పదును పెడుతూ అవకాశాలు చేజిక్కించుకుంటూ ఓ ఇమేజ్ కు దగ్గరవుతున్నారు. ఫలితంగా ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టేలా పాత్రలకు ప్రాణం పోస్తూ తమలోని నటనకు కొత్త భాష్యం చెబుతున్నారు. ఇటీవల కాలంలో పోటీ మరీ ఎక్కువైపోయింది. ఏ రంగం చూసినా పోటీకి చిరునామాగా మారుతున్నాయి. అందుకే ఎవరి తెలివి వారి సొత్తు. ఎవరి టాలెంట్ వారికి శ్రీరామరక్షగా మారుతంది.
Also Read:KGF 2: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?