https://oktelugu.com/

Nani- Sagar Chandra: నానితో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సినిమా ఫిక్స్

Nani- Sagar Chandra:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “భీమ్లా నాయక్” ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘భీమ్లానాయక్‌’ డైరెక్టర్ సాగర్ చంద్ర కొత్త సినిమా గురించి కొత్త ముచ్చట్లు వినిపిస్తున్నాయి. సాగర్ చంద్ర మంచి విషయం వున్న దర్శకుడు. ‘అయ్యారే’ లాంటి సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టాడు. అలాగే […]

Written By:
  • Shiva
  • , Updated On : May 5, 2022 / 06:08 PM IST
    Follow us on

    Nani- Sagar Chandra:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఏంటో బాక్సాఫీస్ వద్ద “భీమ్లా నాయక్” ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ సునామి సృష్టిస్తూ.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులను సెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘భీమ్లానాయక్‌’ డైరెక్టర్ సాగర్ చంద్ర కొత్త సినిమా గురించి కొత్త ముచ్చట్లు వినిపిస్తున్నాయి. సాగర్ చంద్ర మంచి విషయం వున్న దర్శకుడు. ‘అయ్యారే’ లాంటి సినిమాతో పరిశ్రమలో అడుగుపెట్టాడు.

    Nani

    అలాగే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ లాంటి డిఫరెంట్ సినిమా తీసాడు. అయితే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమాతో మాస్ ఆడియన్స్ కి సాగర్ పేరు బాగా తెలిసింది. అందుకే, ఇప్పుడు సాగర్ దర్శకత్వంలో కొత్త సినిమా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. హీరో నానితో సాగర్ కొత్త సినిమా ఓకే అయ్యిందని.. ఇది హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది.

    Also Read: Sreeleela: ‘శ్రీలీల’ రెట్టింపు అందం కోసం ఇలా చేస్తోందా ?

    కాగా ఈ కథలో చాలా డెప్త్ ఉంటుందట. నిజానికి భీమ్లా నాయక్ కంటే ముందే నాని ఈ సినిమాను ఓకే చేశాడు. అయితే అప్పుడు బడ్జెట్ విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. సినిమా పోస్ట్ ఫోన్ అయ్యింది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న కథ అట. ఇప్పుడు సాగర్ కి మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది కాబట్టి.. మొత్తానికి ఈ హిస్టారికల్ నేపథ్యం ఉన్న సినిమా త్వరలోనే స్టార్ట్ కానుంది.

    Nani- Sagar Chandra

    పైగా పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ లాంటి మాస్ హిట్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి.. సాగర్ కోసం హీరోలు కూడా రెడీగానే ఉంటారు. అన్నట్టు ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశాడు సాగర్. నాని వచ్చే నెల నుంచి సాగర్ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడు. మరి నాని సినిమా చేయడానికి అంగీకరించాడు అంటే.. సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే.

    Also Read:KGF 2: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?

    Tags