Rajeev Kanakala-Suma Viral Video: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా కొత్త కథలతో సినిమాలైతే వస్తున్నాయి. ప్రతి ఒక్క దర్శకుడు తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చాలా వరకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ మంచి సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… సాయి మార్తాండ్ అనే కొత్త దర్శకుడు ‘లిటిల్ హార్ట్స్ ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత వారంలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయిలన్ సాధించింది. ఇక 2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 25 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఎలాంటి సినిమా అయితే కావాలని కోరుకున్నాడో అలాంటి సినిమానే తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ సాధిస్తోంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో రాజీవ్ కనకాల హీరో ఫాదర్ గా నటించాడు.
ఇక ఈ సినిమాలో కాత్యాయని అనే ఒక సాంగ్ అయితే బాగా వైరల్ అయింది. ఆ సాంగ్ స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు ఎంటర్ టైన్ అయ్యారు. అందువల్లే ఈ సాంగ్ కి ఎనలేని గుర్తింపు రావడమే కాకుండా రాజీవ్ కనకాల సైతం ఈ సాంగ్ ను ఇంట్లో వాళ్ళు తినేటప్పుడు పాడుతూ తన భార్య అయిన సుమకి తలపోటు తెప్పించాడనే చెప్పాలి.
మరి ఏది ఏమైనా కూడా ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక రాజీవ్ కనకాల ఫన్నీగా పాడిన ఈ పాట మాత్రం ప్రతి ఒక్కరిని చాలా వరకు ఫన్ కి గురిచేస్తోంది. మరి ఏది ఏమైనా కూడా సుమ – రాజీవ్ కనకాల ఇద్దరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. సుమ తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
ఇక రాజీవ్ కనకాల ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రను పోషిస్తూ తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే గతంలో రాజీవ్ కనకాల చేసిన సినిమాలన్నింటిలో ఆయన చనిపోవడం అనేది కామన్ గా జరుగుతూ వచ్చేది. కానీ ఈ సినిమాలో మాత్రం ఆయన చివరి వరకు చనిపోకుండా ఉంటాడు. అదొక్కటే మంచి విషయం…ఇక మీదట కూడా ఆయన చాలా సినిమాలకు కమిట్ అయి ఉన్నాడు…
#LittleHearts ❤️❤️ pic.twitter.com/umVirMZ9Bz
— Cinema Madness 24*7 (@CinemaMadness24) September 16, 2025