Bigg Boss 9 Telugu Viral Video: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి నేటి వరకు మాస్క్ మ్యాన్ హరీష్ ఆడియన్స్ కి, హౌస్ మేట్స్ కి ఎలాంటి తనలోని భిన్నమైన షేడ్స్ ఎలా చూపిస్తున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. తాను పట్టుకున్న కుందేలుకి మూడు కాళ్ళు మాత్రమే ఉంటాయి అనే సామెత ఈ మాస్క్ మ్యాన్ హరీష్ కి సరిగ్గా సరిపోతుంది. చిన్న విషయాన్నీ సాగదీసి పెద్దది చేయడంలో బిగ్ బాస్ హిస్టరీ లో ఇతన్ని మించిన వాడు లేరు అని చెప్పొచ్చు. ఇష్టమొచ్చినట్టు ఎదుటి వ్యక్తులపై నోరు జారడం, నోరు జారిన తర్వాత తన తప్పు ని చూపించినప్పటికీ కూడా అంగీకరించకుండా మూర్ఖంగా వాదించడం వంటివి ఇతనికి మాత్రమే చెల్లింది. అందుకు బెస్ట్ ఉదాహరణ శనివారం ఎపిసోడ్. భరణి, ఇమ్మానుయేల్ ని ఆడవాళ్ళతో పోలుస్తూ నోటికి వచ్చినట్టు, దానిని హౌస్ మేట్స్, హోస్ట్ నాగార్జున తో పాటు అందరూ తప్పుబట్టడం, దానిని మాస్క్ మ్యాన్ అంగీకరించకపోవడం,తన క్యారక్టర్ ని తక్కువ చేసి చూపిస్తున్నారు అంటూ ఆయన ఇంట్లో నిరాహార దీక్ష చేయడం వంటివి మనం గమనిస్తూనే ఉన్నాం.
గత రెండు రోజులుగా ఆయన ఇంట్లో ఆహరం తీసుకోవట్లేదు. అయితే నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ లో ఈయన గొంతు చించుకొని కంటెస్టెంట్స్ మీద పడిపోవడాన్ని చూసి ఏమి తినకపోయినా ఇతనికి ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే మాస్క్ మ్యాన్ హరీష్ ని ఒక పక్క ఇమ్మానుయేల్, మరో పక్క భరణి నామినేషన్స్ లో చెడుగుడు ఆదుకున్నారు అనే చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే ఇమ్మానుయేల్ ఎదో సరదాకి మాస్క్ మ్యాన్ హరీష్ ని గుండు అంకుల్ అని అంటాడు. దానికి మాస్క్ మ్యాన్ చేసిన హంగామా ఎలాంటిదో మనమంతా చూసాము. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా దానిని సాగదీస్తూ పెద్ద సీన్ క్రియేట్ చేసాడు.
అయితే గత వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో ఇమ్మానుయేల్ ని బాడీ షేమింగ్ చేస్తాడు మాస్క్ మ్యాన్. దానికి నిన్న నామినేషన్స్ లో ఇమ్మానుయేల్ ప్రశ్నిస్తూ ‘నిన్ను గుండు అంకుల్ అని అంటేనే తీసుకోలేకపోయావ్. అలాంటిది నన్ను బాడీ షేమింగ్ చేస్తూ ఎందుకు వెక్కిరించావు, అసలు నీకు ఏమి హక్కు ఉంది?’ అని అంటాడు. దీనికి సమాధానం చెప్పలేక మాస్క్ మ్యాన్ హరీష్ గట్టిగా అరుస్తూ ఇమ్మానుయేల్ వైపు వస్తాడు. ఇక భరణి విషయానికి వస్తే ‘మనుషులు రెండు రకాలు గా ఉంటారు. కొంతమంది మంచివాళ్ళుగా కనిపిస్తారు, మరికొంత మంది మంచివాళ్ళు గా నటిస్తారు’ అని అంటాడు, దానికి భరణి ‘మీ గురించి కాదు, నా గురించి చెప్పండి’ అంటూ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చే రేంజ్ పంచ్ ఇస్తాడు. ఇలా ఎపిసోడ్ మొత్తం కంటెస్టెంట్స్ గుండు అంకుల్ గుండు పగలగొట్టేసారు అనుకోండి. ఈ ఎపిసోడ్ నేడు రాత్రి టెలికాస్ట్ కానుంది.
