Flora Saini in Trivikram Movie: సినిమా ఇండస్ట్రీ అనేది ఒక జూదం లాంటిది. ఎప్పుడు ఎవ్వరు ఏ పొజిషన్లో ఉంటారు అనేది ఎవ్వరికి తెలియదు. అప్ కమింగ్ హీరోలు ఒక సక్సెస్ వచ్చినంత మాత్రాన హీరోలుగా రాణిస్తారు కానీ స్టార్ హీరోలు అయిపోరు. అలాగే ఒక్క ఫ్లాప్ వచ్చినంత మాత్రాన స్టార్ హీరోలు అమాంతం కిందికి అయితే పడిపోరు. కానీ మీడియం రేంజ్ హీరోల జీవితంలో మాత్రం చాలా రకాల వైవిధ్యమైన పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు ఒక్క సక్సెస్ వస్తే ఐదారు సినిమాలకు కమిట్ అవుతారు. అదే ఒక ఫ్లాప్ సినిమా వస్తే మాత్రం కమిటీ అయినా ఆ సినిమాలు కూడా వాళ్లకు ఉండవు. అందుకే ఇక్కడ ఒక సినిమా చేయాలంటే చాలా రకాలుగా ఆలోచించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది…ఇదిలా ఉంటే సినిమాతో పాటు పోటీపడి మరి టెలివిజన్ రంగం కూడా చాలా వరకు అభివృద్ధిని సాధించింది. ఇక టెలివిజన్ రంగంలో కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే షోస్ చాలానే వచ్చాయి. మరి ఇలాంటి సందర్భంలో బిగ్ బాస్ షో ఎంతటి గుర్తింపును సంపాదించుకుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే 8 సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు తొమ్మిదో సీజన్ ని కూడా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు.
ఇక ఇప్పటికే ఈ సీజన్ స్టార్ట్ అయి పది రోజులు పూర్తి అయింది. ఆల్రెడీ మొదటి వారంలో శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది…ఇక బిగ్ బాస్ షో లో ముఖ్యంగా ఫ్లోరా షైనీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. నిజానికి ఆశా షైనీ గా ఉన్న తన పేరుని ఫ్లోరా షైనీగా మార్చుకుంది.
ఆమె కెరియర్ మొదట్లో నరసింహనాయుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అలాగే నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఆశ షైనీ ఒకప్పుడు చాలా అందంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం చాలా మారిపోయింది. ఆమె మొహంలో అంత అందమైతే కనిపించడం లేదు.
ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు తనని చూస్తే తన సినిమాలో ఏదో ఒక పాత్ర కోసం ఆమె తీసుకోవచ్చు అని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో పాత హీరోయిన్ లను అమ్మ పాత్రల్లో గాని, అత్త పాత్రల్లో గాని తీసుకుంటూ ఉంటాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఫ్లోరా సైతం ఇప్పుడు వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో నటిస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి గురూజీ ఆమెకు మరోసారి లైఫ్ ఇస్తాడా లేదా అనేది..