https://oktelugu.com/

RajaShekar: పెళ్లి చేసుకుంటానని రూ.15 లక్షలతో.. నటుడు రాజశేఖర్‌ ఇంట్లో ఏం జరిగిందంటే?

రాజశేఖర్ ఇంట్లో పనిచేస్తున్న ఆ మహిళను డ్రైవర్ మత్తులోకి దించాడు. ఆ మహిళ తన భర్తతో గొడవలు ఉన్నాయని.. గమనించి ఆమెకు దగ్గర కావడం మొదలుపెట్టాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆ మహిళను నమ్మించాడు. దీంతో ఆ మహిళ పూర్తిగా అతని మాటలు నమ్మి, తన దగ్గర ఉన్న బంగారం, డబ్బు ఇచ్చింది. ఐఫోన్ కొనుక్కుంటానని అడిగితే తన దగ్గర ఉన్న డబ్బుతో కొని ఇచ్చింది. ఇలా ఆమె దగ్గర నుంచి రూ.15 లక్షలు తీసుకుని పారిపోయాడు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 22, 2024 / 08:22 PM IST

    Rajashekar

    Follow us on

    RajaShekar: ప్రముఖ సినీ నటుడు రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి గొప్ప నటుడిగా తన కంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటి 75కి పైగా సినిమాల్లో నటించాడు. చివరిగా నితిన్ సినిమాలోని ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌లో రాజశేఖర్ కనిపించారు. కేవలం సినిమాల్లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా హీరో అనిపించుకున్నాడు. ఇదిలా ఉండగా.. రాజశేఖర్ ఇంట్లో జరిగిన ఓ షాకింగ్ ఘటన జరిగింది. కొందరు బతకడం కోసం గ్రామాలు వదిలి పట్టణాలకు వస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ మహిళ విశాఖపట్నం నుంచి వచ్చి నటుడు రాజశేఖర్ ఇంట్లో పనిచేస్తుంది. వైజాగ్‌లోని వేపగుంటకి చెందిన ఓ మహిళకు తన భర్తతో విభేదాలు వచ్చాయి. దీంతో ఆమె కుటుంబ పోషణ కోసం హైదరాబాద్ వచ్చి నటుడు రాజశేఖర్ ఇంట్లో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే రాజశేఖర్ ఇంట్లో కొత్తవలసకి చెందిన ఓ వ్యక్తి కూడా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

    రాజశేఖర్ ఇంట్లో పనిచేస్తున్న ఆ మహిళను డ్రైవర్ మత్తులోకి దించాడు. ఆ మహిళ తన భర్తతో గొడవలు ఉన్నాయని.. గమనించి ఆమెకు దగ్గర కావడం మొదలుపెట్టాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆ మహిళను నమ్మించాడు. దీంతో ఆ మహిళ పూర్తిగా అతని మాటలు నమ్మి, తన దగ్గర ఉన్న బంగారం, డబ్బు ఇచ్చింది. ఐఫోన్ కొనుక్కుంటానని అడిగితే తన దగ్గర ఉన్న డబ్బుతో కొని ఇచ్చింది. ఇలా ఆమె దగ్గర నుంచి రూ.15 లక్షలు తీసుకుని పారిపోయాడు. దీంతో ఆ మహిళ రాజశేఖర్‌కు చెప్పగా.. వెంటనే వారు ఆ మహిళతో పెందుర్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని శిక్షించాలని పోలీసులను కోరారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దరాప్తు ప్రారంభించారు.

    ఇదిలా ఉండగా ఇప్పటి తరం వాళ్లకి రాజశేఖర్ పెద్ద హీరో అనిపించకపోవచ్చు. కానీ అప్పటి రోజుల్లో రాజశేఖర్ అంటే బాక్సాఫిస్ దగ్గర వసూలు భారీగా వచ్చేవి. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా సినిమాలకు వాయిస్ కూడా ఇచ్చేవాడు. అప్పటి రోజుల్లో అన్ని సినిమాలకు ఇతని వాయిస్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడంటే ఇండస్ట్రీలో అంతా మారిపోయింది. కానీ అప్పటిల్లో ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పలేనిది. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇతని నటనకి ఫిదా అయిపోయేవారు. అలా రాను రాను జనరేషన్ మారిన తర్వాత రాజశేఖర్ క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. అయిన మళ్లీ గరుడవేగ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చేసిన కల్కి, శేఖర్ వంటి సినిమాల్లో కూడా నటించారు. అయితే మళ్లీ పవన్‌ సాదినేని దర్శకత్వంలో రాజశేఖర్ మరో కొత్త సీరియస్‌ యాక్షన్‌ డ్రామా సినిమాతో వస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.