Sridevi Death Mystery : ఇండియన్ సినిమాను మకుటం లేని మహారాణిగా ఏలింది శ్రీదేవి. ఆమె అందానికి లోకం దాసోహం అయ్యింది. దానికి అద్భుతమైన నటన తోడు కావడంతో శ్రీదేవి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దశాబ్దాల పాటు సిల్వర్ స్క్రీన్ పై సంచలనాలు నమోదు చేసింది. సౌత్ లో స్టార్ గా ఎదిగిన శ్రీదేవి… నార్త్ పై కన్నేసింది. అక్కడకు వెళ్లి నెంబర్ వన్ హీరోయిన్ పొజీషన్ కైవసం చేసుకుంది.
తెలుగులో శ్రీదేవి చివరిసారిగా 1994లో చిరంజీవికి జంటగా ఎస్పీ పరశురామ్ మూవీ చేసింది. ఇక శ్రీదేవి చివరి చిత్రం షారుఖ్ ఖాన్ నటించిన జీరో. ఈ మూవీలో గెస్ట్ రోల్ చేసింది. ఒక వయసు వచ్చాక శ్రీదేవి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేశారు. గృహిణి తరహా పాత్రలు చేసింది. కన్నుమూసే వరకు శ్రీదేవి నటిస్తూనే ఉంది. 2018లో ఓ వేడుకకు హాజరయ్యేందుకు శ్రీదేవి భర్త బోనీ కపూర్ తో పాటు దుబాయ్ వెళ్ళింది. ఫిబ్రవరి 24న ఓ హోటల్ లో ఆమె కన్నుమూశారు. మొదట్లో ఆమె మరణానికి కారణం హార్ట్ అటాక్ అనుకున్నారు.
దుబాయ్ పోలీసుల విచారణలో ఆమె బాత్ టబ్ లో మునిగి చనిపోయారని తేలింది. శ్రీదేవి ఆల్కహాల్ సేవించి ఉన్నట్లు కూడా రిపోర్ట్ లో ఉందని సమాచారం. ఈ కేసులో దుబాయ్ పోలీసులు బోనీ కపూర్ ని విచారించారు. మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. ఇది మర్డర్ కూడా కావచ్చంటూ పుకార్లు చెలరేగాయి. వంద కోట్ల ఇన్సూరెన్స్ కోసం ఇలా చేశారంటూ ఓ పుకారు చక్కర్లు కొట్టింది.
బోనీ కపూర్ భార్య శ్రీదేవి మరణం పై స్పందించలేదు. ఎట్టకేలకు ఆయన స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. శ్రీదేవికి ఉన్న అందం పిచ్చే ఆమె మరణానికి కారణమైందని బోనీ కపూర్ మాటలను బట్టి అర్థం అవుతుంది. శ్రీదేవి ఎప్పుడూ యవ్వనంగా, నాజూగ్గా కనిపించాలి. అప్పుడే సిల్వర్ స్క్రీన్ పై మనం ఆకర్షణీయంగా కనిపిస్తాము. పాత్రకు సరిపోతామని ఆమె భావించేవారట. అందుకోసం కఠిన డైట్ ఫాలో అయ్యేదట.
ఉప్పు లేకుండా ఆహారం తినేదట. హోటల్స్ లో కూడా ఉప్పులేని ఆహారమే కావాలని పట్టుబట్టేదట. ఆమె పాటించిన ఆహార నియమాలు దీర్ఘ కాలంలో ప్రతికూల ప్రభావం చూపాయి. శ్రీదేవి మరణం అనంతరం బోనీ కపూర్ ఇంటికి ఓదార్చడానికి వెళ్లిన నాగార్జున, గతంలో షూటింగ్ లో శ్రీదేవి స్పృహ తప్పి పడిపోయిన విషయం గుర్తు చేశాడట.