https://oktelugu.com/

Sandeep Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ టీజర్ విడుదల ఖరారు..ఫ్యాన్స్ కి పూనకాలు రప్పించే అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగ!

సంక్రాంతికి 'స్పిరిట్' చిత్రం నుండి అభిమానులకు ఏదైనా అప్డేట్ ఇవ్వబోతున్నారా అని అడిగిన ప్రశ్నకు సందీప్ సమాధానం చెప్తూ 'కచ్చితంగా ఇవ్వబోతున్నాము..త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన అధికారికంగా జరగబోతుంది' అని చెప్పుకొచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 22, 2024 / 08:05 PM IST

    Spirit' movie teaser release

    Follow us on

    Sandeep Vanga : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకులు కూడా అత్యంత ఆసక్తిని చూపిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. అర్జున్ రెడ్డి, ఎనిమల్ చిత్రాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి యూత్ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో ప్రభాస్ ని ఆయన ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో చూపించబోతున్నాడు. మామూలు కుర్రాళ్ళని తన సినిమాల్లో ఎంతో క్రూరంగా, బోల్డ్ గా చూపించే అలవాటు ఉన్న సందీప్ వంగ, పవర్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ ని ఎంత బోల్డ్ గా చూపిస్తాడో మీ ఊహలకే వదిలేస్తున్నాం. మరి అంత క్రూరమైన హీరో క్యారక్టర్ కి ధీటుగా, అవతల వైపు విలన్ క్యారక్టర్ కూడా ఉండాలి కదా.

    అందుకే కొరియన్ సూపర్ స్టార్ ‘డాన్ లీ’ ఈ సినిమా కోసం తీసుకున్నారు. ‘డాన్ లీ’ ఎవరో తెలియాలంటే ఒక్కసారి యూట్యూబ్ లోకి వెళ్లి అతని సినిమాల్లోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూడండి. రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ లో ఉంటాయి. ప్రభాస్ కంటే ఎంతో పవర్ ఫుల్ గా కనిపించే ఈ వ్యక్తి, ఇందులో విలన్ గా నటించబోతున్నాడు అనే వార్త రాగానే అభిమానులు ఎంతో ఆనందించారు. ఇది మాత్రమే కాకుండా ఇందులో మెగా స్టార్ చిరంజీవి కూడా ఒక కీలక పాత్రలో నటించేందుకు సుముఖత చూపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆయన ప్రభాస్ కి గాడ్ ఫాదర్ క్యారక్టర్ లో కనిపించనున్నాడని టాక్. ఇవన్నీ నిజమో కాదో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సందీప్ వంగ, ఈ చిత్రానికి సంబంధించిన ఒక సెన్సేషనల్ అప్డేట్ ని ఇచ్చాడు.

    ఈ సంక్రాంతికి ‘స్పిరిట్’ చిత్రం నుండి అభిమానులకు ఏదైనా అప్డేట్ ఇవ్వబోతున్నారా అని అడిగిన ప్రశ్నకు సందీప్ సమాధానం చెప్తూ ‘కచ్చితంగా ఇవ్వబోతున్నాము..త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన అధికారికంగా జరగబోతుంది’ అని చెప్పుకొచ్చాడు. అయితే వీళ్ళు సంక్రాంతికి ఇవ్వబోతున్నది టీజర్ అని తెలుస్తుంది. నెల రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్న సందీప్, టీజర్ కి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా సిద్ధం చేసినట్టు టాక్. జనవరి 11 న ఈ టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. అంతకు ముందే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేస్తారట. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో వచ్చే వారంలో తెలియనుంది.