https://oktelugu.com/

MAA Election: అందుకే నా భర్త మోహన్ బాబును కలిశారు.. జీవిత రాజశేఖర్?

MAA Election: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా మారాయి. మా ఎన్నికలు ఏకంగా రాజకీయ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయని చెప్పవచ్చు. మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి మంచు విష్ణు, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మంచు విష్ణు ప్యానెల్ గురించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత మంచు విష్ణు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 7, 2021 / 04:43 PM IST
    Follow us on

    MAA Election: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎంతో ఉత్కంఠభరితంగా మారాయి. మా ఎన్నికలు ఏకంగా రాజకీయ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయని చెప్పవచ్చు. మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి మంచు విష్ణు, నటుడు ప్రకాష్ రాజ్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. తాజాగా మంచు విష్ణు ప్యానెల్ గురించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత మంచు విష్ణు మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

    ఈ క్రమంలోనే మంచు విష్ణు మాట్లాడుతూ తాజాగా రాజశేఖర్ గారు తన తండ్రిని కలవడానికి వచ్చారని చెబుతున్న సమయంలో ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్ తనని ఇప్పుడే మాట్లాడకు అని చెప్పారు. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ లో విష్ణు నటి జీవితా రాజశేఖర్ పై కూడా తనదైన శైలిలో కౌంటర్ వేశారు. ఈ క్రమంలోనే నటి జీవిత మరోసారి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన భర్త ఎందుకు మోహన్ బాబు గారిని కలవాల్సి వచ్చిందో వెల్లడించారు.

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త మోహన్ బాబు గారిని కలిసిన మాట వాస్తవమేనని తెలియజేశారు. అయితే మా సొంత నిర్మాణ సంస్థలో మా ఆయన కథానాయకుడిగా గత కొన్ని రోజుల నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సినిమా తెరకెక్కుతోంది.ఈ క్రమంలోనే ఒకరోజు సినిమా షూటింగ్ కు అరగంట లేటుగా వస్తానని చెప్పడంతో ఎందుకు అని అడగగా దారిలోనే మోహన్ బాబు గారి ఇల్లు ఉంది వెళ్లి ఆయనను కలిసి మాట్లాడి వస్తానని చెప్పారు.

    అయితే రాజశేఖర్ గారు మోహన్ బాబు గారిని కలిసి ప్రస్తుతం మా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో జరుగుతున్న గొడవలు గురించి రాజశేఖర్ మోహన్ బాబుతో ప్రస్తావించారని, బయట మోహన్ బాబు కుటుంబానికి చిరు కుటుంబానికి మధ్య ఆధిపత్య పోరు జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. కనుక ఈ గొడవలన్నీ సద్దుమణిగేలా చూడమని రాజశేఖర్ మోహన్ బాబు గారిని కలిసి మాట్లాడారని ఈ సందర్భంగా జీవిత రాజశేఖర్ ప్రెస్ మీట్ లో అసలు విషయాన్ని తెలియజేశారు.