Homeఎంటర్టైన్మెంట్Rajasekhar Missed Role Seethamma Vakitlo Sirimalle Chettu: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో...

Rajasekhar Missed Role Seethamma Vakitlo Sirimalle Chettu: ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో హీరో రాజశేఖర్ మిస్ చేసుకున్న పాత్ర అదే..

Rajasekhar Missed Role Seethamma Vakitlo Sirimalle Chettu: ఒకప్పుడు హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకున్న రాజశేఖర్ , ఇప్పుడు హీరో గా తన కెరీర్ ముగియడం తో క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు. అందులో భాగంగా ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘బైకర్’. శర్వానంద్ హీరో గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 3 న విడుదల కాబోతుంది. ఇందులో శర్వానంద్ బైక్ రేసర్ గా నటించగా, రాజశేఖర్ శర్వానంద్ కి తండ్రి గా, కోచ్ గా నటించాడు. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గానే ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు. ఈ ట్రైలర్ ని చూస్తుంటే శర్వానంద్ కి మరో సూపర్ హిట్ దక్కేలా ఉందని అనిపిస్తోంది. అదే విధంగా రాజశేఖర్ కి కూడా మంచి క్యారక్టర్ దొరికినట్టుగా అనిపించింది.

Also Read: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు

ఇదంతా పక్కన పెడితే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రాజశేఖర్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను ఎప్పుడూ నవ్వుతూ ఉంటాను కాబట్టి, నాకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ చిత్రం లో రేలంగి మామయ్య క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది. కానీ అప్పటి పరిస్థితుల కారణంగా ఈ చిత్రం లో నటించలేకపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రం లో హీరోల పాత్రలకు ఏ మాత్రం తీసిపోని పాత్ర రేలంగి మామయ్య. ప్రకాష్ రాజ్ ఈ పాత్రలో నటించలేదు, కేవించాడు అనే చెప్పొచ్చు. అయితే గతం లో ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ , ఈ పాత్రని ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ కి వినిపించానని , ఆయనకు చాలా బాగా నచ్చింది కానీ, అప్పటికే ఆయనకు వరుస కమిట్మెంట్స్ ఉండడం వల్ల , ఈ పాత్ర చెయ్యలేకపోయాడని చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు రాజశేఖర్ చెప్తున్న మాటలను బట్టీ చూస్తుంటే, ఈ పాత్ర కోసం ఆయన్ని కూడా సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఇలా శ్రీకాంత్ అడ్డాల సౌత్ లో పలువురి హీరోలను ఆ పాత్ర కోసం సంప్రదించే స్థాయికి వెళ్లాడంటే , ఆ క్యారెక్టర్ మీద ఆయనకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్యారెక్టర్ ని పెద్ద స్థాయి నటులు చేసి ఉండుంటే , కలలో కూడా ఊహించనంత భారీ మల్టీ స్టార్రర్ చిత్రం గా నిలిచేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper
Exit mobile version