Rajasaab Movie Second Song: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన ‘రాజా సాబ్'(Rajasaab Movie) చిత్రం విడుదల అయ్యేందుకు కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ ని కూడా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ విషయాన్నీ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా లోని మెలోడీ సాంగ్ ‘సహానా..సహానా’ పాటకు సంబంధించిన ప్రోమో ని రీసెంట్ గానే విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ప్రమోషనల్ కంటెంట్ చాలానే వచ్చింది, కానీ ఒక్కటి కూడా క్లిక్ అవ్వలేదు. ఈ సహానా పాట ఎదో వర్కౌట్ అయ్యేలా ఉంది అని అంతా అనుకున్నారు. కాసేపటి క్రితమే ఈ పాటని విడుదల చేశారు. ఊహించినట్టుగానే ఈ పాటకు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తమన్ మ్యూజిక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ నిన్న మొన్నటి వరకు వేరే లెవెల్ లో ట్రోల్స్ చేస్తూ వచ్చారు. కానీ ఈ పాట విన్న తర్వాత ట్రోల్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నారు. ఆ రేంజ్ లో ఉంది ఈ పాట. విజువల్స్ అదిరిపోయాయి, ట్యూన్ విన్న మొదటి హియరింగ్ లోనే అందరికీ కనెక్ట్ అయిపోయింది. ప్రభాస్ లుక్స్ కూడా ఈ పాటలో అదిరిపోయాయి, లొకేషన్స్ కూడా బాగున్నాయి. ఏ యాంగిల్ లో చూసినా ఈ పాట ఫ్యాన్స్ కి ది బెస్ట్ అనే చెప్పాలి. కానీ మామూలు ఆడియన్స్ కి మాత్రం యావరేజ్ ఫీలింగ్ వస్తుంది. ఈమధ్య కాలం లో విడుదలైన పాటల్లో పెద్ది నుండి వచ్చిన ‘చికిరి చికిరి’ పాట సెన్సేషన్ సృష్టించింది. మెలోడీ అంటే ఆ రేంజ్ లో ఉండాలని అంతా కోరుకుంటున్నారు. అలాంటి స్టాండర్డ్స్ సెట్ చేసిన పాట విన్న ఆడియన్స్ కి ఇది కచ్చితంగా యావరేజ్ అనే అనిపిస్తాది.
ఇదంతా పక్కన పెడితే ఈ పాట నిడివి కేవలం 2:34 నిమిషాలు మాత్రమే ఉండడం తో, అయ్యో అప్పుడే అయిపోయిందే అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఫుల్ ఆడియో వెర్షన్ 4 నిమిషాల 24 సెకండ్స్ అట. ఇది అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉంటుందని కాసేపటి క్రితమే మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కాపీ సిద్ధంగా ఉందట. సినిమా నిడివి 3 గంటల 15 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం. ఫైనల్ కట్ మూడు గంటలకు కుదించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా ని ఊపేస్తున్న సహానా సాంగ్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము, విని ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పండి.