Bigg Boss 9 Telugu Demon Pawan: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) ఓటింగ్ లో రోజురోజుకి జరుగుతున్న మార్పులు చూస్తుంటే బిగ్ బాస్ మ్యానేజ్మెంట్ కి కూడా పిచ్చెక్కిపోతుంది. నిన్న మొన్నటి వరకు విన్నింగ్ రేస్ కేవలం తనూజ , పవన్ కళ్యాణ్ మధ్య మాత్రమే ఉండేది. కానీ ఈరోజు ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. డిమోన్ పవన్ అలియాస్ సాయి పవన్ కుమార్ ఇప్పుడు రెండవ స్థానం లోకి ఎగబాకినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. చాప క్రింద నీరు లాగా చివరి కెప్టెన్సీ టాస్కు నుండి డిమోన్ పవన్ ఓటింగ్ పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే రీతూ చౌదరి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యిందో, అప్పటి నుండి డిమోన్ పవన్ లోని కామెడీ యాంగిల్ బయటపడింది. గడిచిన రెండు వారాల నుండి ఇతని కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇమ్మానుయేల్ ని కూడా దాటిపోయింది అంటే అతిశయోక్తి కాదేమో.
అంతే కాకుండా సోమవారం రోజున ఇతను తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ విని ఆడియన్స్ బాగా ఎమోషనల్ అయిపోయారు. ఇంత టాలెంట్ ఉన్న కుర్రాడు, హౌస్ లో గొడ్డు చాకిరి చేస్తాడు, అందరితో ఎంతో మంచిగా ఉంటాడు , హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఇతని పరిస్థితి ఆర్థికంగా బాగాలేదు, అయినప్పటికీ తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ని సానుభూతి కోసం వాడుకోలేదు, ఇతనికి కదరా మనం ఓట్లు వెయ్యాలి అంటూ ఫ్యామిలీ ఒక రేంజ్ లో గుద్దేస్తున్నారట. ముఖ్యంగా నార్త్ ఇండియన్ కాలేజీల నుండి ఓటింగ్ వేరే లెవెల్ లో పడుతుందని సమాచారం. ఇతనికి, తనూజ కి మధ్య ఉన్న తేడా కేవలం 0.5 శాతం మాత్రమేనట. కానీ డిమోన్ పవన్ AV వేరే లెవెల్ లో వచ్చిందట. అది టెలికాస్ట్ చేసిన తర్వాత ఇతని రేంజ్ నెంబర్ 1 కి ఎగబాకిన ఆశ్చర్యపోనవసరం లేదట.
ఓటింగ్ ఆర్డర్ చూస్తే మొదటి స్థానం లో పవన్ కళ్యాణ్ 30 శాతం ఓటింగ్ తో కొనసాగుతున్నాడట. ఇతనికి హాట్ స్టార్, ఇంటర్నేషనల్ కాల్స్, మరియు నార్త్ ఇండియా నుండి సరిసమానమైన ఓటింగ్ పడుతుందట. ఇక ఆ తర్వాత రెండవ స్థానం లో డిమోన్ పవన్ 26 శాతం తో ఉన్నాడు. ఇతనికి నార్త్ ఇండియా నుండి ఓటింగ్ వేరే లెవెల్ లో ఉందట. ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో తనూజ 25.5 శాతం తో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఈమెకి ఇంటర్నేషనల్ ఓటింగ్ వేరే లెవెల్ లో ఉందట. అన్ని యాంగిల్స్ నుండి భారీ ఓటింగ్ పడుతున్న ఏకైక కంటెస్టెంట్ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇంకా మూడు రోజుల సమయం ఉంది. డిమోన్ పవన్ ఏ క్షణం లో అయినా పవన్ కళ్యాణ్ కి దగ్గరగా రావొచ్చు, అలా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఈ ముగ్గురిలో ఎవరు టైటిల్ లిఫ్ట్ చేసినా ఆశ్చర్యపోకండి.