Allu Arjun And NTR: ఇండియా వైడ్ గా ఇప్పుడు క్రేజీ మల్టీస్టార్రర్ సినిమాలు ఎక్కువ అయిపోయాయి. ఒకప్పుడు ఇద్దరు హీరోలను పెట్టి సినిమాలు తీయాలంటే దర్శక నిర్మాతలు భయపడే వారు. కానీ ఇప్పుడు మాత్రం సర్వసాధారణం అయిపోయింది. #RRR తర్వాత అయితే నేటి తరం సూపర్ స్టార్స్ కూడా కలిసి ఒకే సినిమాలో చేసేస్తున్నారు. ఇకపోతే త్వరలోనే మరో క్రేజీ మల్టీస్టార్రర్ సెట్ కాబోతుందా? అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అల్లు అర్జున్(Icon Star Allu Arjun) హీరో గా నటించబోతున్న తదుపరి చిత్రం లో, ఒక ముఖ్యమైన క్యారక్టర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) ని సంప్రదించినట్టు లేటెస్ట్ గా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ చిత్రానికి దర్శకుడు మరెవరో కాదు, లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj). రీసెంట్ గానే కూలీ చిత్రం తో ఫ్లాప్ ని అందుకున్న ఆయన, ఇప్పుడు మన టాలీవుడ్ హీరోల చుట్టూ తిరుగుతున్నాడు.
ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక స్టోరీ ని వినిపించాడు. ఆయనకు కథ నచ్చింది, సినిమా చేయడానికి కూడా సిద్దమే. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా ఒక కథ ని వినిపించాడట. అది ఆయనకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా అల్లు అర్జున్ ఉంటే, సెకండ్ హీరో గా ఎన్టీఆర్ ఉంటాడట. ఆయన క్యారక్టర్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్ ని రీసెంట్ గానే లోకేష్ సంప్రదించాడని, ఆయన నుండి ఎలాంటి సిగ్నల్ వస్తుందో అని ఎదురు చూస్తున్నారని అంటున్నారు. అల్లు అర్జున్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తే ఎన్టీఆర్ కాదని అనడు. కానీ అభిమానులు ఈసారి మాత్రం ఎన్టీఆర్ పై ఫైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే ఈమధ్య కాలం లో ఎన్టీఆర్ ఎక్కువగా ఇలాంటి రోల్స్ వేస్తున్నాడు. #RRR చిత్రం పేరుకి మల్టీస్టార్రర్ అయినా, అందులో కథ పరంగా మెయిన్ లీడ్ రామ్ చరణ్ అనేది కాదు అనలేని వాస్తవం. ఇక ఈ ఏడాది విడుదలైన ‘వార్ 2’ లో అయితే ఎన్టీఆర్ ఏకంగా విలన్ క్యారక్టర్ చేసాడు. ఈ విషయం లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా నొచ్చుకున్నారు. త్వరలోనే ఆయన షారుఖ్ ఖాన్ ‘పఠాన్ 2’ లో కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడని ఈమధ్యనే ఒక వార్త వినిపించింది. ఇక నేడు అల్లు అర్జున్ , లోకేష్ కనకరాజ్ సినిమాలో కూడా ఎన్టీఆర్ సెకండ్ లీడ్ క్యారక్టర్ అనే వార్త రాగానే అభిమా