
దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ లేస్తూ వస్తోంది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. అక్టోబర్ 13న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ఆర్ఆర్ఆర్ టీం కష్టపడుతున్నారు. ఆ తేదీకి సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా చివరి షెడ్యూల్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ అంతా కలిసి ఉక్రెయిన్ వెళ్లారు. ఈ సినిమా యూనిట్ అక్కడ పాటలు చిత్రీకరిస్తే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ మొత్తం షూటింగ్ పూర్తయ్యినట్టే. అయితే సినిమా షూటింగ్ పూర్తయినా కూడా అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేయగలరా? లేదా అనే దాని మీద ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది.
ఎందుకంటే మామూలుగానే రాజమౌళి సినిమాలో దాదాపు అన్ని గ్రాఫిక్స్ వర్క్ మీదనే ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి షూటింగ్ పూర్తి చేసి అదంతా గ్రాఫిక్స్ వాళ్లకు ఇచ్చినా వాళ్లు సరైన సమయంలో పూర్తి చేయడం లేదట.. ఇప్పటికే బాహుబలి సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు ఆలస్యమైంది.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైందని అంటున్నారు. సినిమా రిలీజ్ చేసేందుకు గ్రాఫికస్ పూర్తి కావాల్సి ఉందని.. అది పూర్తయితే సినిమా రిలీజ్ చేసేందుకు వీలుంటుందట.. గ్రాఫిక్స్ లేట్ అవ్వడంపై రాజమౌళి సీరియస్ అయ్యాడని..వారికి వార్నింగ్ ఇచ్చి అక్టోబర్ లోపు పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీ అయ్యేలా చూడాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు గ్రాఫిక్స్ టీంకు రాజమౌళి పెద్ద క్లాస్ పీకినట్టు తెలిసింది.