బాల‌య్య మ‌న‌స్త‌త్వం బయటపెట్టిన యాంక‌ర్‌!

యాంక‌ర్ ప్ర‌దీప్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియ‌ని వారు ఉండ‌రు. యాంక‌రింగ్ అంటే అమ్మాయిలకే స్కోప్ ఉండే ఇండ‌స్ట్రీలో.. త‌న‌దైన టాలెంట్ తో దూసుకొచ్చి టాప్ పొజిష‌న్ లో వెలుగొందుతున్నాడు ప్ర‌దీప్‌. ప్ర‌ముఖ ఎఫ్ఎమ్ సంస్థలో జాకీగా కెరీర్‌ మొద‌లు పెట్టిన‌ ప్రదీప్.. ఆ తర్వాత ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్’ అనే గేమ్‌ షోతో యాంకర్‌గా మారిపోయాడు. అనంత‌రం ‘గడసరి అత్త సొగసరి కోడలు’ అనే షోతో టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. అలా జోరందుకుందున్న‌ ప్ర‌దీప్ కెరీర్‌.. […]

Written By: Bhaskar, Updated On : August 6, 2021 4:40 pm
Follow us on

యాంక‌ర్ ప్ర‌దీప్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియ‌ని వారు ఉండ‌రు. యాంక‌రింగ్ అంటే అమ్మాయిలకే స్కోప్ ఉండే ఇండ‌స్ట్రీలో.. త‌న‌దైన టాలెంట్ తో దూసుకొచ్చి టాప్ పొజిష‌న్ లో వెలుగొందుతున్నాడు ప్ర‌దీప్‌. ప్ర‌ముఖ ఎఫ్ఎమ్ సంస్థలో జాకీగా కెరీర్‌ మొద‌లు పెట్టిన‌ ప్రదీప్.. ఆ తర్వాత ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్’ అనే గేమ్‌ షోతో యాంకర్‌గా మారిపోయాడు.

అనంత‌రం ‘గడసరి అత్త సొగసరి కోడలు’ అనే షోతో టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. అలా జోరందుకుందున్న‌ ప్ర‌దీప్ కెరీర్‌.. నిరంత‌రాయంగా కొన‌సాగుతూనే ఉంది. అద్దిరిపోయే టైమింగ్‌తో పంచులు.. త‌న‌దైన వాక్చాతుర్యం ప్రదర్శిస్తూ తెలుగులో నెంబ‌ర్ వ‌న్ మేల్‌ యాంక‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ప్ర‌దీప్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ మెంటాలిటీ గురించి ఎవ‌రికీ తెలియ‌ని సీక్రెట్ చెప్పాడు.

తక్కువ సమయంలోనే ఎదిగిన ప్రదీప్.. స్మాల్ స్క్రీన్ పై వరుస ఆఫర్లు అందుకున్నాడు. ఈ వ‌రుస‌లోనే.. ‘ప్రదీప్ దర్భార్’, ‘అదుర్స్, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘నర్తనశాల’, ‘డ్రామా జూనియర్స్’ ‘కిక్’, ‘సరిగమప’, ఢీ వంటి టీవీ షోలలో సత్తా చాటాడు. అదేవిధంగా కొన్ని సినిమాల్లోనూ చిన్న పాత్ర‌ల్లో నటించి నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే.. హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు ప్ర‌దీప్. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ త‌ర్వాత కూడా యాంక‌రింగ్ ను జోరుగా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు.

ప్ర‌స్తుతం ‘డ్రామా జూనియ‌ర్స్ – ద నెక్స్ట్ సూప‌ర్ స్టార్‌’ అనే కిడ్స్ షోకు హోస్టుగా ఉన్నాడు. ఈ షోకు రేణు దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అలీ జ‌డ్జీలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నెక్స్ట్ సండే ప్ర‌సారం కాబోయే ఎపిసోడ్ కు సీనియ‌ర్‌ క‌మెడియ‌న్ బాబూ మోహ‌న్ అతిథిగా వ‌చ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వైర‌ల్ అయ్యింది. ఇందులో బాల‌కృష్ణ మ‌న‌స్త‌త్వం గురించి చెప్పాడు యాంక‌ర్ ప్రదీప్‌.

ఈ ప్రోమోలో.. మాస్ట‌ర్ ప్ర‌జ్వ‌ల్‌ బాల‌కృష్ణ గెట‌ప్ లో వ‌చ్చాడు. దీంతో ఆయ‌న గొప్ప‌ద‌నం గురించి అలీ, బాబు మోహ‌న్ వివ‌రించారు. ఈ క్ర‌మంలోనే యాంక‌ర్ ప్ర‌దీప్ కూడా బాల‌య్య గురించి చెప్పాడు. ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే.. తాను బాల‌కృష్ణ‌కే ఫోన్ చేస్తాన‌ని చెప్పాడు. క్యాన్సర్ ట్రీట్ మెంట్ కు సంబంధించి ఎంతో మందికి ఆయ‌న చికిత్స చేయించార‌ని చెప్పాడు. ఎలాంటి అవ‌స‌రం ఉన్నా.. త‌న‌కు ఫోన్ చేయాల‌ని బాల‌కృష్ణ చెప్పిన‌ట్టు ప్ర‌దీప్ తెలిపాడు. ఆ విధంగా.. బాల‌య్య మ‌న‌స్త‌త్వం గురించి వివ‌రించాడు.