Homeఎంటర్టైన్మెంట్Rajamouli RRR : ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి తారుమారు !

Rajamouli RRR : ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి తారుమారు !

RRR Movie PostponedRajamouli RRR: “ఆర్ఆర్ఆర్” (RRR Movie) అక్టోబర్ 13న రిలీజ్ కావట్లేదు అనేది క్లారిటీ వచ్చింది. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? ఎంత పాన్ ఇండియా సినిమా అయితే మాత్రం, ఎన్ని భారీ అంచనాలు ఉంటే మాత్రం.. అభిమానులు ఒకసారి విసిగిపోయారు అంటే.. ఇక మళ్ళీ ఆ సినిమా పై ఆసక్తి పెంచుకోరు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఇది జరిగేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మూడు సార్లు వాయిదా పడింది.

రాజమౌళి మాత్రం కొత్త డేట్ ఎప్పుడు చెబుతాడా ? అని ఎదురు చూస్తున్నారు మిగిలిన సినిమా వాళ్లు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ ను బట్టి తమ సినిమాల రిలీజ్ ను ప్లాన్ చేసుకోవాలని వారి ఆశ. కానీ, రాజమౌళి మాత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. అలాగే అక్టోబర్ 13 నుంచి సినిమాని వాయిదా వేశామని కూడా రాజమౌళి చెప్పలేదు.

జక్కన్న (Rajamouli) చెప్పకపోయినా ఇండస్ట్రీలో ఆ రిలీజ్ పై స్పష్టత వచ్చింది. అందుకే, అక్టోబర్ 8, 13 తేదీలకు పలు చిన్న చిత్రాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. మరి “ఆర్ఆర్ఆర్” రిలీజ్ పరిస్థితి ఏమిటి ? నిజానికి ఈ సినిమా విషయంలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు ఆదరాభిమానాలను చూపించడం లేదు.

“దోస్తీ” అనే మొదటి పాటను చాలా గ్రాండ్ గా షూట్ చేసి వదిలారు జక్కన్న. కానీ ఆ పాటకు సినిమా స్థాయికి తగ్గ ఆదరణ లేదు. అంతకు ముందు ఎన్టీఆర్ పై ఒక టీజర్ ను, చరణ్ పై ఒక టీజర్ ను కట్ చేసి రిలీజ్ చేశారు. ఒక స్టార్ హీరో సినిమా టీజర్ కి ఏ రేంజ్ వ్యూస్ వస్తాయో.. అన్నే వ్యూస్ ఎన్టీఆర్ – చరణ్ ల టీజర్స్ కి వచ్చాయి.

అంటే.. ఆర్ఆర్ఆర్ టీజర్స్ అని వాటికీ ప్రత్యేక వ్యూస్ ఏమి రాలేదు. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం.. రాజమౌళి జాగ్రత్తగా సినిమాని ప్లాన్ చేయకపోతే.. బాక్సాఫీస్ వద్ద ఆశాభంగం కలగకమానదు అని సెలవిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే నెల తిరిగే సరికి ‘దోస్తీ’ పాటని జనం మర్చిపోయారు. అలాగే అంతకు ముందు టీజర్స్ కూడా జనానికి గుర్తు లేవు. వీటిన్నింటిని బట్టి ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి లెక్కలు తారుమారు అయ్యేలా ఉన్నాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Ranganath Controversy: ఆ భూమే.. హైడ్రా రంగనాథ్ కు ఇబ్బందికరం.. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే..

Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...
Oktelugu Epaper
Exit mobile version