Premature closure of Post Office: దేశంలోని ప్రజలలో చాలామంది పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎక్కువగా పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే పోస్టాఫీస్ ఖాతాదారులు తప్పనిసరిగా కొన్ని విషయాలపై అవగాహనను కలిగి ఉండాలి. ఏదైనా స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే స్కీమ్ గడువు ముగిసేంత వరకు డబ్బులను తీసుకోకూడదు. అలా తీసుకుంటే మాత్రం భారీ మొత్తంలో నష్టపోవాల్సి వస్తుంది.
ప్రస్తుతం పోస్టాఫీస్ స్కీమ్స్ పై 5.5 శాతం నుంచి 6.7 శాతం వరకు వడ్డీ రేటు అమలవుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఖాతాలో వడ్డీ జమవుతుంది. సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితితో ఈ విధంగా సులభంగా డబ్బులు దాచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి టర్మ్ ను ఎంచుకుని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే చివరి వరకు ఉండాలి.
చివరి వరకు వేచి ఉండకపోతే వడ్డీ రేటు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు 5 లక్షలు డిపాజిట్ చేసి ఐదేళ్ల టెన్యూర్ ఎంచుకుంటే మెచ్యూరిటీ సమయంలో 6,97,000 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. వడ్డీ రూపంలో ఏకంగా 1,97,000 రూపాయలు లభిస్తాయి. అలా కాకుండా మూడేళ్ల తర్వాత డబ్బులు తీసుకుంటే కేవలం 3.5 శాతం మాత్రమే వడ్డీరేటు లభిస్తుంది. అంటే కేవలం 5,55,102 రూపాయలు మాత్రమే పొందే అవకాశం ఉంటుంది.
టైమ్ డిపాజిట్లను ముందుగానే విత్ డ్రా చేయడం ద్వారా దాదాపు లక్షన్నర రూపాయల వరకు నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. టైమ్ డిపాజిట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకుని చివరి వరకు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు నష్టపోయే అవకాశం అయితే ఉండదు.