RRR: రాజమౌళి తన కొత్త సినిమా “ఆర్ఆర్ఆర్” కోసం చేస్తోన్న ప్రమోషన్స్ ను చూస్తుంటే.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉంది. నిజానికి రాజమౌళి బాహుబలి విషయంలో ఏది ప్లాన్ చేయలేదు. అదృష్టం బాగుండో లేక, నిజంగానే ఆ సినిమా రిలీజ్ సమయంలో అన్నీ అంశాలు అలా కలిసి వచ్చో.. మొత్తానికి ఏదో రకంగా అది నిజమైన పాన్ ఇండియా సినిమా అయింది. ఐతే, ఆర్ఆర్ఆర్ కూడా మరో బాహుబలి అవ్వాలని రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

కాకపోతే, బాహుబలికి దక్కిన ఆదరణ ఆర్ఆర్ఆర్ కి దక్కడం లేదు. అందుకే ప్రమోషన్స్ లో వేగం పెంచాడు. వినూత్నంగా సినిమాను ప్రమోట్ చేయడానికి బాగానే కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి మరో పాట “జనని”ను వదలడానికి సిద్ధం అయ్యాడు. పైగా సినిమా కథకి సోల్ అంతా ఈ పాటలో ఉందని రాజమౌళి టీమ్ చెబుతున్న మాట.
మొత్తానికి పాటకు భారీ వ్యూస్ అనగా 100 మిలియన్ల వ్యూస్ ను సాధించాలని జక్కన్న ఈ పాట విషయంలో ప్రధాన టార్గెట్ గా పెట్టుకున్నాడు. అందుకే, ఈ “జనని” అనే పాట ఆర్ఆర్ఆర్ సినిమా కథని, ముఖ్యంగా సినిమాలోని ప్రధాన పాత్రల ఆత్మని పట్టి చూపుతుందని ఇలా ఓ రేంజ్ లో పాట గురించి బిల్డప్ ఇస్తున్నారు. ఎంత బిల్డప్ ఇచ్చినా ఈ పాట ఎంతవరకు హిట్ అవుతుంది అనేది ఇంకా డౌట్ గానే ఉంది.
అయితే, ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్ ప్రకారం ఈ పాట చాలా బాగా వచ్చిందట. సంగీత దర్శకుడు కీరవాణి సినిమా సోల్ ని పట్టుకొని టైటిల్ సాంగ్స్ ను, అలాగే ఎమోషనల్ సాంగ్స్ ను ఇవ్వడంలో దిట్ట అని, కాబట్టి కచ్చితంగా ఈ పాట కూడా బాగా వచ్చి ఉంటుందని తెలుస్తోంది. కీరవాణి స్వరపరచిన ఈ భావోద్వేగ ‘జనని’ పాట ఆర్ఆర్ఆర్ కథలోని హృదయాన్ని చూపించే కిటికీ అంటూ రాజమౌళి కామెంట్స్ చేశాడు.
Also Read: Kaikala Satyanarayana: కైకాల ఇప్పుడు బాగానే ఉన్నారు.. అసత్య ప్రచారాలు నమ్మొద్దు- కైకాల కుమార్తె
ఇక ఈ నెల 26న విడుదలవుతోంది ఈ పాట. ఇంతకుముందు ఈ సినిమా నుంచి “దోస్తీ”, “నాటు నాటు” పాటలు వచ్చాయి. అవి బాగానే హిట్ అయ్యాయి గానీ, పాన్ ఇండియా స్థాయిలో మాత్రం హిట్ కాలేకపోయాయి. మరి “జనని” పాట హిట్ అవుతుందా ? చూడాలి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Akhanda: ‘అఖండ’ సినిమా మాస్ వర్క్‌తో థమన్ ట్వీట్.. నెట్టింట్లో వీడియో వైరల్