Adbhutam Movie: ఇటీవల ఓటీటీల హవా బాగా పెరిగింది. చిన్న పెద్దా సినిమాలు తేడా లేకుండా అన్ని చిత్రాలూ వీటివైపే అడుగులేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓటీటీ వేదికగా హాట్‌స్టార్‌లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్న టాలీవుడ్ సినిమాల్లో ఒకటి అద్భుతం. యంగ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ నటించిన సినిమా ఇది. అన్ని జానర్ల ప్రేక్షకులను ఆకట్టుకున్నఈ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. నిన్న రాత్రే హాట్‌స్టార్‌లో అద్భుతం సినిమా చూశా. న్యూ ఏజ్ ఎంగేజింగ్ నోవెల్లా ఈ సినిమా అనిపించింది. అందులో తేజ, శివానిల నటన నన్ను ఆకట్టుకున్నాయి. అని మెచ్చుకున్నారు చిరు. ఈ సినిమాలో పనిచేసిన ప్రతిఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉందని దర్శకుడు మల్లిక్ రామ్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.
Thank you so so much @KChiruTweets sir for your ever so kind and encouraging words. It truly means the world to me coming from you and I couldn’t be happier ❤️
Lottttttssss of loveeeeeeee to you😊😊#adbhutamonhotstar @disneyplus https://t.co/vtF0UUMT4J— Teja Sajja (@tejasajja123) November 23, 2021
మెగాస్టార్ రియాక్షన్‌కు మురిసిపోయిన తేజ.. రిప్లై ఇచ్చాడు.. ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చిన చిరంజివి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆయనపై ఎప్పుడూ ప్రేమ పొంగిపోతుంటుందని అన్నారు.
ఈ సినిమాలో మిర్చి కిరణ్, తులసి, శివాజీ రాజా తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాథన్ సంగీతం అందించారు. జాంబి రెడ్డి సినిమాతో యంగ్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన హీరో తేజ సజ్జా. ఇప్పుడు ఈ సినిమా హిట్‌తో మరో మెట్టు ఎదిగాడు. భవిష్యత్తులో ఇంకెన్ని విజయాలు సాధిస్తాడో చూడాలి మరి.